జనవిజయంతెలంగాణకరోనాపై సుధాకర్ వినూత్న ప్రచారం

కరోనాపై సుధాకర్ వినూత్న ప్రచారం

  • హేండ్ మైక్ ద్వారా వినూత్న ప్రచారం చేస్తున్న టిఎస్ యుటిఎఫ్ సభ్యుడు సుధాకర్
  • బైక్ పై 13వేల కిలోమీటర్లు పూర్తి చేసిన ప్రచారం
  • పర్యటనలో భాగంగా శుక్రవారం బివికె ఐసోలేషన్ సందర్శన
  • బి.వి.కె, డి.వై.ఎఫ్.ఐ సేవలను అభినందించిన సుధాకర్
  • సుధాకర్ సామాజిక సృహని అభినందించిన పొన్నం వెంకటేశ్వరరావు

ఖమ్మం, జూన్ 18(జనవిజయం): కరోనా మహమ్మారి విజృంభించి ప్రజల ప్రాణాలను తీస్తుంటే మానవత్వంతో చాలా మంది తమకు తోచిన విధంగా సహాయం చేస్తుండడం చూస్తున్నాం. ఆ కోవలోనే ఖమ్మంలో ఓ ప్రభుత్వోపాధ్యాయుడు కరోనాపై పోరాటానికి తనవంతు సహాయం చేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు దంతాల సుధాకర్ వినూత్న పద్ధతిలో హేండ్ మైక్ ద్వారా ప్రచారం చేస్తూ, కరోనా పై పాటలు పాడుతూ, కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతూ, వచ్చిన వాళ్ళు భయపడకుండా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో, వాక్సిన్ వేయించుకుంటే కలిగే ఉపయోగాలేమిటో తెలియచెబుతూ తన బైక్ మీద ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకూ మొదటి లాక్ డౌన్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 13వేల కిలోమీటర్ల తిరిగి, అన్ని మండల, జిల్లా కేంద్రాలలో ప్రచారం నిర్వహించినట్లుగా సుధాకర్ తెలియజేశారు. ఈ ప్రచారంలో భాగంగా ఖమ్మం విచ్చేసిన సుధాకర్ బివికె కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ బివికె, డివైఎఫ్ఎ బృందం వారు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా సుందరయ్య భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ సుధాకర్ ప్రచారాన్ని అభినందించారు. సుధాకర్ లాగా ప్రతి పౌరుడు సామాజిక సృహతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్, డివైఎస్ఇ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, బివికె జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి పద్మ, మాచర్ల భారతి, మెరుగు సత్యనారాయణ, నందిపాటి మనోహర్, పోన్నేకంటి సంగయ్య, డివైఎఫ్ఎ నాయకులు ఇంటూరి అశోక్, గుమ్మా ముత్తారావు, పోలేపల్లి చరణ్య, గిరి, వేముల సాంబ, కూరపాటి శ్రీను, ఎన్ఎస్ఏ ప్రవీణ్, గోపి, ఐద్వా భాగం అజిత తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి