జనవిజయంసాహిత్యంకరోనాను గెలుస్తున్న యోధులకు నీరాజనాలు

కరోనాను గెలుస్తున్న యోధులకు నీరాజనాలు

కేసారి లభించే మానవ జన్మను
ఆత్మబలంతో మరింత తేజస్సుతో
శోభాయమానం చేసుకుంటున్న వీరులు…

మనోధైర్యంతో పరిస్థితులకు ఎదురొడ్డి
వ్యాధి శరీరానికే గాని మనస్సుకు కాదని
మొక్కువోని తెగువతో కరోనాని జయించి
సంపూర్ణ ఆరోగ్యంతో
బ్రహ్మానందంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న వృద్ధులు…

ఒకవైపు ప్రసవ వేదన
మరో వైపు కరోనాని తట్టుకుని
బిడ్డలకు జన్మనిస్తున్న దేవతలు…

మన ప్రాణాలను నిలబెట్టటం కోసం
తమ అసాధారణ పోరాట స్ఫూర్తితో
మహమ్మారి మధ్యలో సవ్యసాచులై
అనునిత్యం యుద్ధం చేస్తున్న
వైద్య సిబ్బంది, పోలీసులు, కార్మికులు…

మన ఆకలి బాధలను తీర్చటమే ధ్యేయంగా
తిండి గింజలు పండించటం కోసం
సమయంతో,పరిణామాలతో సంబంధం లేకుండా
తమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ
ప్రాణవాయువు అందిస్తున్న రైతన్నలు..

ప్రజల నిత్య జీవన గమనానికి కావల్సిన
ఆర్ధిక వనరులను అందించటానికి
దేనినీ లెక్కించక
తమ అస్తిత్వాన్ని చరితార్థం
చేసుకుంటున్న బ్యాంక్ సిబ్బంది….

ఎప్పటికప్పుడు ప్రజావాహిని శ్రేయస్సుకై
కరోనాకి వెరవక తమ కలాలను కాలంతో పరిగెత్తిస్తూ
కర్తవ్యానికి ప్రతీకలై నిలుస్తున్న జర్నలిస్టులు….

పెద్ద గీత ముందు
చిన్న గీత గీస్తున్న
మహా యోధులారా….ఇవే మా నీరాజనాలు….

  • అట్లూరి వెంకటరమణ
    9550776152

——–

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి