జనవిజయంతెలంగాణకరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలి - సిపిఎం నేత భారతి డిమాండ్

కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలి – సిపిఎం నేత భారతి డిమాండ్

  • కరోనాను అరికట్టడంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
  • ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి
  • ప్లకార్డులతో సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన

ఖమ్మం,జూన్ 3(జనవిజయం): కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి విమర్శించారు. గురువారం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం వద్ద జిల్లా కమిటీ సభ్యులు విక్రం అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాచర్ల భారతి మాట్లాడుతూ కరోనా కేసులు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ దొరకక ప్రజల ప్రాణాలు పోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని అన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. కరోనా వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు వ్యాక్సిన్ విషయంలో అనేక లోటుపాట్లను గుర్తించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి, చీవాట్లు పెట్టినా, వాటిని అమలు చేయడంలో ప్రధానంగా లోపం కనిపిస్తుందని, దీనివలన పేద, మధ్య తరగతి ప్రజలు వ్యాక్సిన్ దొరకక నానా అవస్థలు పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రత్యేక కరోనా హాస్పిటల్ ప్రారంభించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా వైద్యం అందించాలని, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని కోరారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు సత్వరమే ఎకేషియా ప్రకటించి చెల్లించాలన్నారు. ఈ

ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ ఇస్తామని గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదని విమర్శించారు. వెంటనే జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బండి పద్మ,

జిల్లా నాయకులు ప్రకాష్, బషీర్, ఎండీ గౌస్, నర్రా రమేష్, మేకల నాగేశ్వరరావు, మాచర్ల గోపాల్, కాంపాటి వెంకన్న, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి