జనవిజయంఆరోగ్యంకరోనా కట్టడిలో వ్యక్తుల బాధ్యత లేదా?

కరోనా కట్టడిలో వ్యక్తుల బాధ్యత లేదా?

  • వ్యక్తిగత పరిశుభ్రతను వీడరాదు
  • లేకుంటే కరోనా వెన్నంటే ఉంటుంది
  • వైద్య నిపుణుల హెచ్చరిక

హైదరాబాద్‌,మే21(జనవిజయం): కరోనా వైరస్‌ ప్రభావం ఇప్పట్లో పోయే పరిస్థితి లేనందున ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కరోనాను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఈ లోగా సడలింపు ఇచ్చారు. దీంతో వ్యాధి సంక్రమణకు అవకాశాలు పెరిగాయని, కరోనా వైరస్‌ నియంత్రణకు వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటున్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు పలు సూచనలు పాటించాలని చెబుతున్నారు. వేడి నీళ్లు ఎక్కువ తాగడం, వేడి నీళ్లు గొంతులో పోసుకుని పుక్కిలించడం, వేడి నీళ్లలో పసువు కలుపుకుని తాగడం, వేడి వేడి టీ, కాఫీలు తాగాలని పేర్కొంటున్నారు. అందరూ తమ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, అందుకోసం విటమిన్‌ సి, సిట్రస్‌ ఎక్కువగా ఉండే పళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. నిత్యావసర సరుకులు తీసుకోవడానికి బయటకి వెళ్లినప్పుడు మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు గేటు హ్యాండిల్‌ గానీ, డోర్‌ హ్యాండిల్‌ గానీ పట్టుకోవద్దని, నేరుగా వాష్‌రూంకు వెళ్లి బట్టలు విప్పి సోప్‌ లేదా డిటర్జెంట్‌లో వేసి, తలస్నానం చేయాలని చెబుతున్నారు. అలాగే ఐస్‌ క్రీం, కూల్‌ డ్రిరక్స్‌ వంటి చల్లటి వస్తువులు ఏవిూ తీసుకోవద్దని సూచించారు. చల్లటి వస్తువులకు దూరంగా ఉండాలంటున్నారు. ఎండాకాలం కారణంగా కూల్‌ డ్రింకుల జోలికి వెళ్లొదన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు. ఉద్యోగాల కోసం పోయేవారు పోగా, చిన్నపిల్లలు, వృద్దులు ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు. చేతులను శానిటైజర్లు, సబ్బుతో 20 నుంచి 30 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలని పేర్కొంటున్నారు. ముఖాన్ని చేతులతో తాకవద్దు, ముఖ్యంగా కళ్లు, ముక్కు, నోటి భాగాలకు తాకరాదని, దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు ముఖానికి మోచేతులు అడ్డం పెట్టుకోవాలని సూచిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ ఇతరులతో కనీసం మూడు విూటర్ల దూరం పాటించాలని చెబుతున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అలాగే భౌతిక దూరం తప్పనిసరి చేసుకోవాలన్నారు. ఇతరులను కలుసుకోవడానికి అప్పుడే తొందర పడరాదన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి