జనవిజయంఆరోగ్యంకరోనా కట్టడికి చర్యలు ప్రకటించిన ఖమ్మం నగర మేయర్

కరోనా కట్టడికి చర్యలు ప్రకటించిన ఖమ్మం నగర మేయర్

ఖమ్మం, మే16 (జనవిజయం) : ఖమ్మం నగరంలో కరోనా కట్టడిలో భాగంగా పారిశుద్ధ్య పరంగా తీసుకోబోతున్న చర్యలను నగర మేయర్ పునుకొల్లు నీరజ ఆదివారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రతి 15 డివిజన్లలో హైపోక్లోరైట్ స్ప్రేయింగ్ ఐదుగురు ఎస్.ఐల వారీగా జరిగేలా షెడ్యూలు చేశారు. వీరి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ స్ప్రేయింగ్ కార్యక్రమం జరుగుతుంది. నగరంలోని మొత్తం 60 డివిజన్లనలో చెత్త తరలించే వాహనాలను, పారిశుద్ధ్య కార్మికులను కేటాయించారు. నగరంలో ప్రతిరోజూ అన్ని మురుగు కాలువలు శుభ్రం చేయగానే బ్లీచింగ్ చల్లేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి డివిజన్ లో కోవిడ్ వల్ల మరణాలు జరిగిన లేదా కోవిడ్తో బాధపడుతున్న వారి ఇంటివద్ద కూడా హైపోక్లోరైట్ స్ప్రేయింగ్ కోసం ఒక పవర్ స్ప్రేయర్ ను కేటాయించారు. దీనికోసం ఒక పారిశుద్ధ్య కార్మికుడిని కేటాయించారు. కోవిడ్ టెస్టింగ్, వ్యాక్సినేషన్ కేంద్రాలలో కూడా ఎప్పటికపుడు హైపోక్లోరైట్ స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. పారిశుద్ధ్య నిర్వహణకోసం 60ట్రాక్టర్లు, 30 ఆటోలను కేటాయించారు. కోవిడ్ మరణాలకు సంబంధించి వైకుంఠధామాల దగ్గర ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ని నోడల్ అధికారిగా నియమించారు.ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో ఎక్కడ మరణం జరిగినా నోడల్ అధికారి మొబైల్ నంబరు 6281948876 కు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి