జనవిజయంతెలంగాణకరోనా కష్టం నుండి వ్యవసాయ కార్మికులకు, పేద ప్రజలందరికీ రక్షణ కల్పించాలి

కరోనా కష్టం నుండి వ్యవసాయ కార్మికులకు, పేద ప్రజలందరికీ రక్షణ కల్పించాలి

ఖమ్మం, జూన్ 4 (జనవిజయం): వ్యవసాయ కార్మికులకు, పేద ప్రజలందరికీ కరోనా నివారణ వ్యాక్సిన్ ఇవ్వాలని, కరుణ టెస్టులు పెంచాలని గ్రామ మండల స్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కమిటీ కోరింది. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన వైద్యాధికారి మాలతికి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరోనా మహమ్మారితో వ్యవసాయ కార్మికులు పేదలు వైద్యం అందక ఇబ్బందులు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టెస్టులు చేయడంలో వ్యాక్సిన్ ఇవ్వడంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలు చనిపోతున్నా పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. అనేక దేశాలు తమ జనాభాకు రెండు రేట్లు 3 రేట్లు వ్యాక్సిన్లు ఆర్డరిచ్చి తెచ్చుకుంటే భారతదేశంలో 135 కోట్ల మంది జనాభా ఉంటే కేవలం 18 కోట్లు మాత్రమే చేయించడం వల్ల వ్యాక్సిన్ అందక అనేకమంది ప్రజలు కరోనా బారిన పడి చనిపోతున్నారని ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని విమర్శించారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని ప్రజలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలంలో చనిపోయిన ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు సంగయ్య పాల్గొన్నారు. జిల్లా వైద్య ప్రధాన అధికారి వారి పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సంఘం నేతలు తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి