జనవిజయంతెలంగాణకరోనా టెస్టుల, వ్యాక్సిన్ కోసం వచ్చిన వారికి సిపిఎం ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ 

కరోనా టెస్టుల, వ్యాక్సిన్ కోసం వచ్చిన వారికి సిపిఎం ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ 

  • కరోనా బాధిత కుటుంబాలకు నెలకు 7500రూపాయలు ఇవ్వాలి
  • ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం నేత దొండపాటి నాగేశ్వరరావు

బోనకల్, జూన్ 4 (జనవిజయం): సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో బోనకల్ ప్రభుత్వ ఆసుపత్రికి కరోనా టెస్ట్ కోసం, వ్యాక్సినేషన్ కోసం  వచ్చిన ప్రజల కోసం రెండోవ రోజు కూడా సిపిఎం ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కొనసాగింది. ఈ అల్పాహార కార్యక్రమం రావినూతల గ్రామ సిపిఎం సహకారంతో సాగింది.  ఈ కార్యక్రమాన్ని రావినూతల ఎంపీటీసీ కందిమళ్ళ.‌రాధ ప్రారంభించారు. ఈ  సందర్భంగా  సిపిఎం  మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కరోనా టెస్టుల కోసం వ్యాక్సిన్ ల కోసం వచ్చే వారందరికీ ఉదయంపూట అల్పాహారం సిపిఎం ఆధ్వర్యంలో అందజేయనున్నట్లు తెలిపారు. మండలంలో రోజు రోజుకి కరోనా వ్యాధి బాధితుల సంఖ్య పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ కారణంగా అనేక పేద కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బాధిత కుటుంబాలకు నెలకు 7500 రూపాయలు, నిత్యావసర సరుకులు అందజేయాలని డిమాండ్ చేశారు. మండలంలో నిర్వహిస్తున్న ఐసోలేషన్ కేంద్రాల్లో బాధితులకు పూర్తిస్థాయిలో వైద్యం అందిస్తూ, పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని కోరారు. మండలంలోని అన్ని గ్రామాలలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ఆ గ్రామాలలో కూడా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆళ్లపాడు గ్రామంలో కరోనా కేసులు రోజు రోజుకి కి పెరుగుతుండటంతో ఉపాధి పనులు నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రావినూతల రెండవ శాఖ కార్యదర్శి కొంగర.గోపి  ఐద్వా మండల ఉపాధ్యక్షురాలు   గుగులోతు. శారద, సిఐటియు మండల కో కన్వీనర్ గుగులోతు. నరేష్ , బోనకల్ మాజీ సర్పంచ్ భుక్యా.జాలు, డివైఎఫ్ఐ  నాయకులు గుగులోతు.సాయి, ధరావతు నరేష్ హరి, దరావతు. జగన్, గుగులోతు. గణేష్ షేక్  ఖాసీం సాహెబ్, వార్డు మెంబర్ లావూరి వెంకటేశ్వర్లు, కందిమళ్ళ. అచ్యుత్ రావు, గుగులోతు. శ్రీను తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి