బోనకల్, ఆగష్టు 21 (జనవిజయం): బోనకల్ మండలంలో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. క్రమంగా బోనకల్ మండలం బీఆర్ఎస్ కు కంచుకోటగా మారుతోంది. చిన్నబిరవల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి 150 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఆదివారంనాడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అందరికీ అన్ని విధాలుగా అండగా ఉంటామని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావులు హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో మండల BRS పార్టీ వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.