కొత్తగూడెం, ఆగష్టు 21(జనవిజయం): ఎన్నికలు ఎప్పుడొస్తాయా… కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడెప్పుడు ఓటు వేయాలని యావత్తు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. కొత్తగూడెం క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశం సందర్భంగా కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం ఏరియాలోని 6,7,8,9,10,11,12 మొత్తంగా ఏడు వార్డులకు చెందిన బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి పొంగులేటి ఆహ్వానించారు.