కాంగ్రెస్ ఇంచార్జ్ గా తుంబూరు ఎంపిక
- కాంగ్రెస్ మండల ఇoఛార్జ్ లు నియామకం
సత్తుపల్లి,జూలై26(జనవిజయం):
కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి మండల ఇంఛార్జ్ గా వేం సూరు మండలానికి చెందిన కల్లూరుగూడెం గ్రామనివాసి తుంబూరు లక్ష్మారెడ్డిని నియమించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఈ ఎంపిక చేసినట్లు లక్ష్మారెడ్డి మీడియాకు వెల్లడించారు. బుదవారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని వేంసూరు మండలానికి అలావత్ వెంకటేశ్వరరావును, పెనుబల్లి మండలానికి కొండూరు కిరణ్ ను, కల్లూరు మండలానికి వడ్లమూడి కృష్ణయ్యను, తల్లాడ మండలానికి తోట జనార్ధన్ లను పువ్వాళ్ల నియమించినట్లు తెలిపారు. ఎంపిక కు సహకరించిన సీనియర్ కాంగ్రెస్ నేత,మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.