జనవిజయంజాతీయంకాంగ్రెస్ అంతేనా? ఆత్మావలోకనం జరిగేనా?

కాంగ్రెస్ అంతేనా? ఆత్మావలోకనం జరిగేనా?

కాంగ్రెస్ లో నాయకత్వ సమస్య మళ్లీ పుండులా నలుపుతోంది. రాహుల్ ను పీఠంపై కూర్చోబెట్టేందుకు సోనియా చేస్తున్న ప్రయత్నాలను సీనియర్లు అంగీకరించడం లేదని తాజా ఘటనలను బట్టి అర్థం అవుతోంది. రాహుల్ కూడా నాయకత్వ పటిమను ప్రదర్శించలేకపోతున్నారు. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న పెట్రో దరలపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చినా పెద్దగా స్పందన రాలేదు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకుని రావడంతో పాటు, ప్రజా సమస్యలపై పోరాడడంలోనూ కాంగ్రెస్ వైఫల్యం కారణంగా మోడీ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. తనకు ఎదురులేనట్లుగా పాలన సాగిస్తున్నారు. బిజెపిలో కూడా తనకు ఎదురులేకుండా మోడీ ముందుకు సాగుతున్నారు. దీనికి కాంగ్రెస్ లో నాయకత్వ లోపమే కారణంగా చెప్పుకోవాలి. దీనికితోడు పార్టీలో ఉన్నా నాయకత్వ లోపంతో పార్టీ నుంచి ఒక్కొక్కరే జారుకుంటున్నారు.

పార్టీ గత చరిత్ర, వారసత్వ రాజకీయాల కారణంగా పార్టీని నడపలేమని సీనియర్లు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. తాజాగా వీరప్పమొయిలీ, కపిల్ సిబాల్ ప్రకటనలను పార్టీ సీరియన్ గా తీసుకోవాలి. రాహుల్ ప్రియాంకలకే పార్టీ బాధ్యతలను అప్పగించాలన్న భావన నుంచి బయటపడాలి. పివి నరసింహారావు లాంటి లీడర్ ఇప్పుడు పార్టీకి అవసరం. ముందుగా పార్టీలో ఉన్న నేతలకు, కార్యకర్తలకు నమ్మకం కలిగించేలా నాయకత్వాన్ని రూపొందించుకోవాలి. కానీ అలా చేయడం లేదు. మధ్యప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. పార్టీని సమర్ధంగా నడిపించలేని పార్టీగా కాంగ్రెస్ మిగిలి పోతోంది. కరోనా నంక్షభం కావచ్చు… పెట్రోల్ ధరలు కావచ్చు, బ్యాంకుల లూటీ కావచ్చు.. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలు కావచ్చు..మోడీని నిలదీసే సత్తాలో ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం లేదు. దీనికితోడు పార్టీలో ఉంటే లాభం లేదనుకున్న వారు జారుకుంటున్నారు. వారు జారుకునేలా కాంగ్రెస్ ప్రవర్తిస్తోంది. దీనికి ఉదాహరణ జితిన్ ప్రసాద బిజెపిలో చేరడమే. అలాగే గులాంనబీ ఆజాద్ లాంటి నేతలు పార్టీకి దూరంగా ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జితిన్ ప్రసాద బీజేపీలో చేరడం కాంగ్రెస్ కు ఓ హెచ్చరికగా చూడాలి. దాదాపు ఏడాది క్రితం జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ ను వదిలి కమలదళంలో చేరి నట్టుగానే, ఇప్పుడు మాజీ కేంద్రమంత్రి పార్టీని విడిచిపోయాడు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాలికొదిలేశాక జ్యతిరాదిత్య బాటలోనే జీతం కూడా నడుస్తారని అధికులు ఊహంచారు. కానీ, పశ్చిమబెంగాల్ ఎన్నికలకు ముందు ఆయనను పార్టీ ఇంచార్జిగా నియమించడంతో జితినను కాంగ్రెస్ బాగానే ఆపగలిగిందని అనుకున్నారు. కానీ ఆయన పార్టీని వీడడం ఆగలేదని, నిర్ణయం మారలేదని జితిన్ ప్రసాద్ నిరూపించారు.

ఇది జితిన్ తప్పు కాదు. కాంగ్రెస్ అంతర్గ నంక్షోభానికి నిదర్శనంగా చూడాలి. కాంగ్రెస్ తో మూడుతరాలుగా ఉన్న బంధాన్ని తుంచేసుకొని బీజేపీలో చేరిన జితిన్ కు తాను విడిచివచ్చిన పార్టీ ఇక ఎంతమాత్రం జాతీయ పార్టీ కాదని అనిపించింది. సంస్థాగతంగా బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అనీ, మిగతావన్నింటికీ అటువంటి లక్షణాలు లేవని అంటున్నారు. ప్రజాసేవ కోసమే పార్టీ మారానని చెప్పారు. అంటే మోడీ నాయకత్వం అందరినీ ఆకర్శిస్తుందనడంలో సందేహం లేదు. మోదీ నాయకత్వం పట్ల ఆయన ఆశాభావంగా ఉన్నారు. బిజెపిలో పరిస్థితులు ఎలా ఉన్నా కాంగ్రెస్ లో మాత్రం ఆశాజనకంగా లేవనే చెప్పాలి. ఈ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ లేకుండా పోయాయి. అందుకే జితిన్ ప్రసాద్ తప్పుకుని ఉండవచ్చు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి భారీ శస్త్ర చికిత్స అత్యవసరమని ఆ పార్టీ సీనియర్ నేత ఎం వీరప్ప మొయిలీ చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీలో ఉన్న అధ్వాన్న పరిస్థితులను సూచిస్తున్నాయి. కేవలం వారసత్వం, గత చరిత్రపై ఆధారపడితే విజయం సాధించ లేమని మొయిలీ నిర్మొహమాటంగానే అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు. ఇది పార్టీకి ఒక గుణపాఠమని అన్నారు. 2019 లోకసభ ఎన్నికల అనంతరం మొయిలీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీకి శస్త్ర చికిత్స అత్యవసరమని అన్నారు. శస్త్ర చికిత్స చాలా ఆలస్యమైందని, ఇది ఇప్పటికిప్పుడే అవసర మని, రేపటికి వాయిదా వేయకూడదని మరోసారి పునరుద్ఘాటించారు.

పార్టీ బాధ్యతలను అప్పగించేటపుడు సైద్ధాంతిక నిబద్ధతగల నేతలకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. పార్టీలోని నేతల సమర్థతలను పార్టీ అధిష్టానం సరైన రీతిలో మదింపు చేయాలని, అర్హత లేని వారిని నేతలుగా తీర్చిదిద్దడం సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ తన వ్యూహాలను పునరాలోచించుకోవాలని సూచించారు. సమర్థులు కానివారికి పదవులు ఇవ్వవద్దని, పార్టీని పునర్వ్యవస్థీకరించాలని కోరారు. వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నిలదొక్కుకోక పోతే.. 2024లో జరిగే లోకసభ ఎన్నికల్లో మరింత కష్టమవుతుందని కూడా ఆయన నిర్మొహమాటంగానే హెచ్చరించారు. కాంగ్రెస్ కేవలం వారసత్వంపై ఆధారపడకూడదని, ప్రధాని మోడీ చేస్తున్న పోటాపోటీ రాజకీయాలకు తగినట్లుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సిందేనని అన్నారు. మోడీని ఓడించడం సాధ్యం కాని విషయమేమి కాదని, కాంగ్రెస్ ను గాడిలో పెడితే మోడీని ఓడించవచ్చునన్నారు. దానికి తగినట్లుగా పార్టీలో మార్పులు చేయాలని, వాయిదా వేయకూడదని హితవు పలికారు. నిజానికి ఇదే అభిప్రాయాన్ని కొంచెం భిన్నంగా కపిల్ సిబాల్ కూడా వ్యక్త పరిచారు. వీరు పార్టీలో అత్యంత సీనియర్లు అన్న విషయం మరువరాదు. కాంగ్రెస్ తాజా పరిస్థితుల ఆధారంగా ఆత్మవలోకనం చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి