భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 23 (జనవిజయం): కలెక్టర్ ప్రియాంక అలా తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు బుధవారం ప్రత్యేక భేటీ అయ్యారు. కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ ప్రియాంక అలా ను కలిసిన రేగా పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపైన, ఇతర మౌలిక వసతుల కార్యక్రమాలపై రేగా కలెక్టర్ తో సుదీర్ఘంగా చర్చించినట్లు ఆ ప్రకటన లో పేర్కొన్నారు.