భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 30 (జనవిజయం): కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పాత కొత్తగూడెంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ ప్రియాంక అలా బుధవారం ఆకస్మికం గా తనిఖీ చేసేరు. ఇళ్ళ నిర్మాణం, సదుపాయాలు గురించి సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు 108 ఇళ్లను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.