భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 02 (జనవిజయం): కలెక్టర్ గా నూతనంగా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ప్రియాంక అలా ను బుధవారం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ బాధ్యులు మర్యాద పూర్వకం గా కలిశారు. ఈ సందర్భం గా తమ అసోషిషన్ ఆధ్వర్యం లో చేపడుతున్న. కార్యక్రమాల గురించి కలెక్టర్ కి వివరించినట్లు ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె. మహిధర్ తెలిపారు. అసోసియేషన్ జిల్లా కోశాధికారి రాసపెళ్లి రాజేంద్రప్రసాద్, రుద్రంపూర్ సర్పంచ్ గుమ్మడి సాగర్, యోగ జిల్లా కార్యదర్శి గుమ్మాలాపురం సత్యనారాయణ, ఇండియన్ స్త్రైల్ రెజ్లింగ్ జిల్లా కార్యదర్శి బరిగెల భూపేష్, అథ్లెటిక్స్ జిల్లా కోచ్ పాము నాగేందర్ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.