జనవిజయంతెలంగాణవరంగల్‌ ఎంజిఎంను సందర్శించిన సీఎం కెసిఆర్‌

వరంగల్‌ ఎంజిఎంను సందర్శించిన సీఎం కెసిఆర్‌

  • తొలిసారి ఆస్పత్రికి రావడంతో అధికారులు అప్రమత్తం
  • కోవిడ్‌ వార్డుల్లో పేషెంట్లతో నేరుగా మాట్లాడిన సిఎం
  • వారిలో భరోసా నింపిన కెసిఆర్‌ పర్యటన
  • సిఎం వెంట మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, అధికారులు

వరంగల్‌,మే21(జనవిజయం): కరోనా రోగుల్లో భరోసా నింపేందుకు నిర్ణయించిన సిఎం కెసిఆర్‌ మలిసారిగా వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. మూడ్రోజుల క్రితం హైదరాబాద్‌ గాందీ ఆస్పత్రిని సందర్శంచిన సిఎం తరవాత ఇప్పుడు వరంగల్‌ వచ్చారు. అక్కడి రోగులను నేరుగా కలుసుకుని పరామర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన లో భాగంగా ఎంజీఎం కొవిడ్‌ వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న సేవను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆస్పత్రిలో సమస్యపై అధికారును సీఎం కేసీఆర్‌ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కరోనా రోగులకు అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలపై సీఎం ఆరా తీశారు. కొవిడ్‌ వార్డుల్లో కలియతిరుగుతూ.. రోగులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు.
వరంగల్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటకు ఎంజీఎం దవాఖానకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. నేరుగా కోవిడ్‌ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్‌ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు.. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్‌ మ్టటెవాడకు చెందిన కరోనా పేషంట్‌ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్‌ జిందాబాద్‌.. కేసీఆరే నా నిండు ప్రాణం అని ఆయన అన్నారు. ప్రతీ బెడ్‌ దగ్గరకూ వెళ్లి కరోనా రోగుకు అందుతున్న వైద్య సేవను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.. అనంతరం సీఎం కేసీఆర్‌ జనరల్‌ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు. ఎంజీఎం ఆస్పత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాను పరిశీలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాు, రోగులకు అందుతున్న వైద్య సేవపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.. ఆస్పత్రిలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పర్యటనలో సీఎం కేసీఆర్‌ వెంట మంత్రు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌, మేయర్‌ గుండు సుధారాణి, సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌, రిజ్వి, డీఎం ఈ రమేష్‌ రెడ్డి, ఓఎస్డీ గంగాధర్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్‌ చంద్ర శేఖర్‌, ఉన్నతాధికాయి, సీపీ తరుణ్‌ జోషి, జిల్లాకు చెందిన పలువురు నాయకులున్నారు. కొవిడ్‌ రోగుకు చికిత్స అందించడంలో ఎంజీఎం ఆస్పత్రి విఫమైందన్న విమర్శలు వెల్లువెత్తడం, కొవిడ్‌ రోగుకు సరైన వైద్య సహాయం అందడం లేదన్న ఆరోపణలు రావడంతో సూపరింటెండెంట్‌గా నాగార్జునరెడ్డిని తప్పించి వి.చంద్రశేఖర్‌ను నియమించారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఎంజీఎం నుంచి సీఎం కేసీఆర్‌ రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కెప్టెన్‌ వి.క్ష్మీకాంతారావు ఇంటికి వెళ్లారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గట్టి పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి