- సిఐ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణపు వెంకటేశ్వరరావు
వేంసూరు, జూలై 17(జనవిజయం):
ప్రభుత్వ పాఠశాలలలో పని చేసే మధ్యాహ్న భోజన పథకం కార్మికులు(మిడ్ డే మిల్స్ కార్మికులు) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10,11,12 తేదీలలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన టోకెన్ సమ్మె ఫలితమే ఏడాదిగా పెండింగ్ లో ఉన్న వేతన హామీ అమలు అని సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి,జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని మర్లపాడు గ్రామ సీఐటీయూ కార్యాలయంలో సోమవారం జరిగిన సీఐటీయూ మండల సమావేశంలో పాల్గొన్న కళ్యాణం మాట్లాడుతూ గతేడాది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఐటీయూ చలో హైదరాబాద్ నిర్వహించగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మూడు వేలు చొప్పున వేతనాలు పెంచారని దాని అమలు కోసం నిరంతరం సీఐటీయూ పోరాటం చేసిందన్నారు.మెనూ చార్జీలు పెంచాలని,లేకుంటే బియ్యంతో పాటు ఇతర సరుకులు పంపిణీ చేయాలని,పని చేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేయాలని,వారసత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భవిష్యత్ కార్యాచరణ పోరాటాలకు సీఐటీయూ సిద్ధమైందని తెలిపారు.ఇతర స్కీమ్ లలో పని చేస్తున్న అంగన్వాడీ,ఆశా,ఐకేపీ ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేసిన పట్టని పాలకులకు రానున్న కాలంలో బుద్ది చెప్పాలని సమావేశంలో పాల్గొన్న శ్రామిక మహిళా జిల్లా నేత పిన్నింటి రమ్య పిలుపునిచ్చారు.కార్మికుల సమస్యలపై నిజాయితీగా రాజీ లేని పోరాటాలు చేసేది సీఐటీయూ నేనని,కొన్ని సంఘాలు కార్మికులను బ్రమలకు గురి చేసి తాత్కాలికంగా లాభం పొందిన భవిష్యత్తులో కార్మికులు,ఉద్యోగులు తగిన బుద్ది చెపుతారని అన్నారు. ఈ సమావేశంలో మండల సీఐటీయూ నేతలు మల్లూరు చంద్రశేఖర్ , సుశీల, జీవమ్మ, లలిత, స్వర్ణ, డంకర శ్రీను, యాకోబు తదితరులు పాల్గొన్నారు.