జనవిజయంతెలంగాణనాణ్యమైన చివరి గింజ వరకు మద్దతు ధర పై ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది - కలెక్టర్లతో...

నాణ్యమైన చివరి గింజ వరకు మద్దతు ధర పై ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది – కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సి.ఎస్.సోమేష్ కుమార్

ఖమ్మం,జూన్5(జనవిజయం): ప్రభుత్వ పధకాల లక్ష్యాలను సాధించే దిశగా జిల్లా కలెక్టర్లు సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యకార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో నిర్మితమౌతున్న నూతన కలెక్టరేట్ భవనాల పనులు, ధాన్యం కొనుగోలు, కరోన నియంత్రణ చర్యలు, ధరణీ సేవలు తదితర అంశాలపై రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలసి సమీక్షించి జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు అదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబందించి మిగిలిన ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని నాణ్యమైన చివరి గింజ వరకు మద్దతు ధర పై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అయన స్పష్టం చేశారు. ఇప్పటికే – కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రణాళిక బద్దంగా రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. జిల్లాలో – చేపట్టిన సమీకృత నూతన కలెక్టరేట్ భవనాల పనులు సకాలంలో పూర్తి అయ్యేల సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే పలు జిల్లాలో పూర్తిచేసుకున్న కలెక్టరేట్ నిర్మాణ పనులలో భాగంగా అంతర్గత పనులను కూడా త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. దీనితోపాటు పనులు పురోగతిలో వున్న నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులో వేగం పెంచి త్వరితగతిన పూర్తయేలా నిరంతరం జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని సి.యస్. కలెక్టర్లను సూచించారు. అదేవిధంగా జిల్లాలో ధరణి ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల లావాదేవీలపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని జూన్ 10వ తేదివరకు కటాఫ్ తేది పరిగణిస్తూ జూన్ 15 నుంచి వానకాలం రైతుబంధు నగదు సహాయాన్ని విడుదల చేయనున్నామని దీనిని దృష్టిలో వుంచుకొని దరణిలో పెండింగ్ లోవున్న మ్యూటేషన్ దరఖాస్తులనుపరిష్కరించాలని సూచించారు.

దీనితోపాటు భూలావాదేవీలు, నిషేధిత భూములకు సంబందించి అందిన పిర్యాదులను పరిశీలించి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూసర్వేకు ప్రభుత్వం నిర్ణయించిందని ముందస్తుగా 27 గ్రామాలలో డిజిటల్ సర్వే నిర్వహించబడు తుందని దీనికి సంబందించిన మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయని తెలిపారు. ప్రభుత్వం నిర్మించతలపెట్టిన వైద్య కళాశాలలకు అనువైన స్థలాలను త్వరలోనే ఎంపికచేసి భూసేకరణకు సంబందించిన నివేదికను సమర్పించాలని సంబందిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 వైద్య కళాశాలలు, అనుబందంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు 500 కోట్లను సైతం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేటాయించారని ఆయన ఈ సందర్భముగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యునిట్ల స్థాపనకు ప్రభుత్వం నిర్ణయించదని ఆయా జిల్లాల పంటల అదారంగా క్రాప్ కాలనీలుగా విభజించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేయాలని, రైతులకు అధిక లాభం ప్రజలకు నాణ్యమైన ఆహారపదార్థాలు అందుబాటులోకి వచ్చేవిధంగా సదరు యూనిట్లు ఉపయోగపడతాయన్నారు. ఇట్టి యూనిట్ల ఏర్పాటుకు జిల్లాలో కనీసం 100 ఎకరాల భూమిని గుర్తించి ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనిపక్షంలో తక్కువ విలువగల భూములను గుర్తించి సేకరణ చేయాలని సి.యస్ సూచించారు.

కరోన రెండో దశ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వానికి అర్ధికంగా నష్ట మైనప్పటికి లాక్ డౌన్ విధించిందని దీనిని కఠినంగా అమలు చేయాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రివర్యుల అదేశాల ప్రకారం జిల్లాలో కరోన పరీక్షలను పెంచాలని, కొవిడ్ లక్షణాలు ఉన్నటువంటి వారు ముందు ఐసోలేట్ కావాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా వ్యాక్షినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయలన్నారు. కరోన చికిత్స కోసం వినియోగించే మెడిసెన్స్ ఇతర పరికరాలు కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సి.యస్.జిల్లా కలెక్టర్లకు అదేశించారు. జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ జిల్లాలో దరణి భూ సమస్యలు, ఇప్పటి వరకు అందిన, పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను, కరోన కట్టడి నియంత్రణ చర్యలను, స్పెషల్ ట్రిబ్యునల్ కేసుల పరిష్కార వివరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి వివరించారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, యన్.మదుసూదన్ రావు, ఆర్.అండ్ బి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్యాంప్రసాద్ సంబంధిత జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి