జనవిజయంఆంధ్రప్రదేశ్ఆక్సిజన్ బ్యాంకిల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న చిరంజీవి

ఆక్సిజన్ బ్యాంకిల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న చిరంజీవి

  • మెగాస్టార్‌ చిరంజీవి సంచలన ప్రకటన
  • ఆక్సిజన్‌ బ్యాంకు ఏర్పాటుకు నిర్ణయం

హైదరాబాద్‌,మే20(జనవిజయం): రక్తం దొరక్క ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998 చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ను ప్రారంభించిన నటుడు చిరంజీవి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి అందిన రక్తంతో ఎంతోమంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఇప్పుడాయన మరో సంకల్పానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశవాప్తంగా కరోనా బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. దీనికి కొంత కారణం ఆక్సిజన్‌ కొరత కూడా కారణం. దాని వల్ల ఎవరూ మరణించకూడదనే ఆలోచనలతో ఆయన ఆక్సిజన్‌ బ్యాంక్‌లను తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలోనూ నెలకొల్పాలని సంకల్పించారు. మరో వారం రోజుల్లో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఆక్సిజన్‌ బ్యాంక్‌ అందుబాటులోకి వస్తుందని రామ్‌చరణ్‌ ట్విట్టర్‌ వేదికగా వ్లెడించారు. కార్యక్రమాలన్నీ రామ్‌చరణ్‌ మానిటర్‌ చేస్తారని, మెగా అభిమానులు కూడా దీనిలో భాగస్వాములు కానున్నారని చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. దీని కోసం ఓ ట్విట్టర్‌ ఖాతాను కూడా ప్రారంభించారు. ఇలా కరోనా బాధితులకు అండగా ఉండేందుకు మెగాస్టార్‌ చిరంజీవి ముందుకొచ్చారు. ఆక్సిజన్‌ కొరత దృష్ట్యా చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలో ఆక్సిజన్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఆక్సిజన్‌ బ్యాంకులు వారం రోజుల్లోనే అందుబాటులోకి రానున్నాయి. ఆక్సిజన్‌ ట్యాంకు నిర్వహణ బాధ్యతను అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులకు అప్పగించనున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి