జనవిజయంజాతీయంచిప్కో ఉద్యమనేత సుందర్‌లాల్‌ బహుగుణ కన్నుమూత

చిప్కో ఉద్యమనేత సుందర్‌లాల్‌ బహుగుణ కన్నుమూత

  • కరోనా బారిన పడి వృద్యాప్యంలో మృతి
  • ప్రధాని మోడీ తదితర ప్రముఖులు సంతాపం

న్యూఢిల్లీ,మే21(జనవిజయం): ప్రఖ్యాత పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్‌ బహుగుణ కన్నుమూశారు. కోవిడ్‌19 వ్యాధితో ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన వయసు 94 ఏళ్లు. రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో ఆయన కోవిడ్‌ చికిత్స పొందారు. మధ్యాహ్నం 12.05 నిమిషాలకు బహుగుణ తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్‌ డైరక్టర్‌ రవికాంత్‌ తెలిపారు. కరోనా పాజిటివ్‌ తేలడంతో.. మే 8వ తేదీన ఆయన్ను హాస్పిటల్‌లో చేర్పించారు. గత రాత్రి ఆయన పరిస్థితి విషమించింది. ఆక్సిజన్‌ లెవల్‌ చాలా వరకు పడిపోయింది. ఇన్నాళ్లూ ఐసీయూలో ఆయన సీపీఏపీ థెరపీలో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌ ప్రాంతంలో ఉన్న మరోడా ఆయన స్వగ్రామం. 1974లో ఆయన చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. చాలా శాంతియుతంగా ఆయన ఆ ఉద్యమాన్ని సాగించారు. ఉత్తరాఖండ్‌లో నిర్మించిన తెహ్రీ డ్యామ్‌కు వ్యతిరేకంగా కూడా ఆయన పోరాటం చేశారు. పర్యావరణవేత్త సుందర్‌లాల్‌ బహుగుణ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేసే మన జీవిన విధానానికి బహుగుణ తార్కాణమని మోదీ అన్నారు. సుందర్‌లాల్‌ మృతి దేశానికి భారీ నష్టమని, తీరని లోటు అని అన్నారు. ఆయన మృదుస్వభావాన్ని ఎన్నటికీ మరవలేమన్నారు. బహుగుణ కుటుంబసభ్యుకు, ఆయన్ను ఇష్టపడేవారికి ప్రధాని మోదీ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రముఖ పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమ నేత సుందర్‌లాల్‌ బహుగుణ మృతి పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లో ఇంద్రకరణ్‌ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థించారు. పర్యావరణ పరిరక్షణ, అడవుల విధ్వంసానికి వ్యతిరేకంగా చిప్కో ఉద్యమం ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జీవితాంతం కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. పర్యావరణ పరిరక్షణకు సుందర్‌ లాల్‌ బహుగుణ చేసిన కృషిని ప్రజలు ఎప్పటికి మరిచిపోరని మంత్రి పేర్కొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి