జనవిజయంఎడిట్జర్నలిజంచిన్నపత్రికలు, జర్నలిస్టులను ఆదుకోవాలి-సిఎం కెసిఆర్ పెద్దమనసుతో పరిష్కరించాలని కోరిన జాక్

చిన్నపత్రికలు, జర్నలిస్టులను ఆదుకోవాలి-సిఎం కెసిఆర్ పెద్దమనసుతో పరిష్కరించాలని కోరిన జాక్

  • కరోనాతో దుర్భర పరిస్థితుల్లో జర్నలిస్టుల జీవితాలు 

హైదరాబాద్, జూన్ 14(జనవిజయం): కరోనా కష్టకాలంలో సిఎం కెసిఆర్ జర్నలిస్టులకు అండగా నిలవాలని అనేక సమస్యలను వారు ఎదుర్కొంటున్నారని తెలంగాణ జెఎసి పేర్కొంది. ఇప్పుడున్న దుర్భర పరిస్థితుల్లో అన్ని వర్గాలను ఆదుకుంటున్న సిఎం కెసిఆర్ ఆర్థికంగా చితికి పోతున్న చిన్నపత్రికలను ఆదుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలను నిలపాలని తెలంగాన జాక్ కన్వీనర్ దేవరకొండ కాళిదాన్, కో కన్వీనర్ అవ్వారు రఘులు కోరారు. కొన్నేళ్లుగా చిన్నపత్రికలకు ప్రకటనల రూపంలో ఆర్థిక సాయం లేకపోవడంతో ఈ రంగాన్ని నమ్ముకునని బతుకుతున్న వేలాదిమంది రోడ్డున పడ్డారని వారు పేర్కొన్నారు. పెద్ద పత్రికలు, ఛానళ్లలో పనిచేస్తున్న వారికి జీతాలు వస్తాయని, కానీ చిన్న సామాన్య పత్రికలకు, మ్యగాజైన్లకు మాత్రం ప్రభుత్వ ప్రోత్సాహమే ముఖ్యమని అన్నారు.

చిన్న మధ్య తరహా పత్రికల్లో పనిచేస్తున్న వారి గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని, వారికి ప్రభుత్వమే అండగా నిలవాలన్నారు. అంతేగాకుండా యూనియన్లు, ఇతరత్రా సంఘాల నేతలు కూడా సమస్యను లోతుగా అర్థం చేసుకుని సిఎం కెసిఆర్ కు చేరవేయడం లేదన్నారు. దీనికి తోడు కరోనాతో ఉపాధి కోల్పోయి వేలాదిమంది రోడ్డున పడ్డారు. వారి గురించి పట్టించుకున్నవారు లేరు. ఈ దశలో అందరి సమస్యలను పరిష్కరిస్తున్న సిఎం కెసిఆర్ వీరిపై దృష్టి సారించాలని పత్రికా ముఖంగా కోరారు. నేరుగా ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసికుని వెళ్లాలని బలంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ జర్నలిస్ట్ జాక్ ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అనేక సహాయ కార్యక్రమాలను చేపట్టింది.

జాక్ కేవలం పత్రికల నమన్యలను, జర్నలిస్టుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు ఇదో వేదికగానే పనిచేస్తుంది. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకని వెళ్ల పరిస్కరించాలని కోరుడమే దీని ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో స్థానిక పత్రికలు, లోకల్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణా జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. సీనియర్ మోస్ట్ జర్నలిస్టులతో జాక్ ని ఏర్పాటు చేశారు. యూనియన్లు, రాజకీయాలతో సబంధం లేకుండా కేవలం జర్నలిస్టుల సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకుని వెళ్లడమే ప్రధాన ఎజెండాగా జాక్ పనిచేస్తోందని నేతలు అన్నారు. కరోనా కష్టకాలంలో ఉన్నందున రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఒక్కో నెలకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని జాక్ నేతలు కోరారు. దేశానికే తలమానికంగా ఉన్న రైతు భీమా పథకం లాగా, జర్నలిస్టులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి భీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఎందరో జర్నలిస్టులు ఈ యేడాది కాలంలో మరణించారని, వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో స్థానిక పత్రికలు, లోకల్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కెసిఆర్ పెద్దమనసుతో ఆలోచన చేయాలని కోరారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి