- కుల వివక్షతకు వ్యతిరేకంగా కుల నిర్ములకై పోరాడటమే అంబేద్కర్ కి నిజమైన నివాళి
- నేటి విద్యార్దులు,యువత అంబేద్కర్ స్పూర్తితో సమస్యలపై పోరాడాలి
- DYFI రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ పిలుపు
- DYFI-SFI ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి
రఘునాదపాలేం,ఏప్రిల్ 14(జనవిజయం): నేడు సమాజంలో ఉన్న కుల వివక్షతకు వ్యతిరేకంగా కుల నిర్ములకై పోరాటమే అంబేద్కర్ గారికి ఇచ్చే నిజమైన నివాళి అన్ని,నేటి విద్యార్దులు,యువత అంబేద్కర్ స్పూర్తితో సమస్యలపై పోరాడాలని DYFI రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ పిలుపునిచ్చారు.
రాజ్యాంగ నిర్మాత డా,బి. ఆర్.అంబేడ్కర్ గారి 134వ జయంతి సంద్భంగా DYFI-SFI చిమ్మపుడి గ్రామ కమిటీల ఆధ్వర్యంలో గ్రామంలో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిదిగా పాల్గొని మాట్లాడుతూ నాడు అంబేద్కర్ గారు సమాజంలో కుల వ్యవస్థ పోవాలని,కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారని,రాజ్యాంగ పరిషత్ చైర్మెన్ గా ఉండి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన మహనీయుడు అంబేద్కర్ గారు ఆన్ని ఆయన అన్నారు.కానీ నేటికీ సమాజంలో ఆ కుల వివక్షత తీవ్రంగా ఉందని,నేడు దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిపోసిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం స్థానంలో నాడు అంబేద్కర్ కాల్చివేసిన మను స్ముతులను,మనుధర్మ శాస్త్ర నీ తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నార నీ ఆయన విమర్శించారు.దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాకే దళితులపై,అణగారిన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని,బిజెపి నాయకులకు అంబేద్కర్ గురుంచి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు.నేడు దేశంలో కులం,మతం పేరుతో రెచ్చగొట్టి బిజెపి చేస్తున్న మతోన్మాద రాజకీయాలకు అతీతంగా అంబేద్కర్ స్ఫూర్తితో నేటి విద్యార్దులు,యువత పోరాడాలని ఆయన పిలుునిచ్చారు.ఈ కార్యక్రమంలో డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్. ఐ నాయకులు దొంతు.గణేష్, దశరధ, వీరబాబు, జోనెబోయిన.నవీన్, షేక్. నాగుల్ మీరా, లింగనబోయిన.మనోజ్, లోకేష్, నాగరాజు, సుప్రియ తదతరులు పాల్గొన్నారు.