ఖమ్మం జులై 23(జనవిజయం):
ఖమ్మం పట్టణ లారీ యజమానులు సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కు ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు.
ఆదివారం మంత్రి పువ్వాడ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు దొంతరబోయిన భద్రం, ప్రధాన కార్యదర్శి బోయపాటి వాసు ఇతర నూతన కార్యవర్గానికి శాలువాకప్పి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇటీవలే కాలంలో మృతి చెందిన సంఘం సభ్యుల కుటుంబాలకు రూ.లక్ష చెక్కులను వారు కుటుంబాలకు అందజేశారు. సంఘం అభివృద్ది, సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. పేద లారీ ఓనర్స్ , కార్మికుల కోసం ప్రభుత్వం నుండి కేటాయించిన ధాన్యం, పత్తి, మొక్క జొన్నలు ఇలా అనేక టెండర్ ఖమ్మం లారీ అసోసియేషన్ వారికే ఇచ్చామని పువ్వాడ తెలిపారు.
మీకు ఎలాంటి సమస్యా వచ్చినా మీ వెన్నంటే ఉండి కాపాడుకున్నాం. లారీల మీద ఆధార పడి కొన్ని వందల కార్మికుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని వారి సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.