జనవిజయంఆధ్యాత్మికంచావు ఖర్చు ఇస్తే ప్రాణాలు నిలుస్తాయా?

చావు ఖర్చు ఇస్తే ప్రాణాలు నిలుస్తాయా?

విజయవాడ, మే 19 (జనవిజయం): దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెరుగుతున్నాయని, దీనికి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమని ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నదన్నారు. కరోనాతో మృతిచెందినవారి దహన సంస్కారాలకూ రూ.15 వేలు ఇచ్చామని చంకలు గుద్దుకుంటున్న వైసీపీ వర్గాలు అసలు కరోనా మరణాలు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చావు ఖర్చు ప్రకటించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వైసిపికి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉందని గొప్పలు చెప్పుకోవడమే కానీ ఈ కరోనా కాలంలో క్షేత్రస్థాయిలో ఒక్క బాధితుడ్ని పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు నేనున్నానంటూ సీఎం జగన్ చెప్పిన చిలకపలుకులు నేడు ఏమయ్యాయని నిలదీశారు.

రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుబంధంగా సమీప భవనాలు తీసుకుని ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామీణ కరోనా రోగులకు చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. కరోనా రోగులకు అత్యవసర మందు రెమిడెసివిల్‌‌ను ప్రైవేట్ వ్యక్తులకు అందకుండా ప్రభుత్వమే సరఫరా చేయాల్సి ఉందని చెబుతూ, ఈ ఇంజక్షన్ వల్ల కరోనా బాధితుల కుటుంబాలు లక్షలు ఖర్చుపెట్టి అప్పులపాలవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కరోనా రోగులను ఫీజుల రూపేణా దోపిడీ చేస్తోన్న ప్రైవేట్ ఆస్పత్రులు అన్నింటినీ ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపిన యెడల ప్రజలు అప్పులపాలు అవకుండా కాపాడగలమని, అత్యవసర చికిత్స కింద రోగుల కుటుంబాలకు ఉపశమనం కలిగించాలన్నారు. అలాగే మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సమీప భవనాలను అద్దెకు తీసుకుని వాటిలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి కిట్లు అందుబాటులో ఉంచినట్లయితే మండల, గ్రామస్థాయిల్లో వున్న రోగులకు సదుపాయంగా ఉంటుందని, ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి కరోనా రక్షణకు కావలసిన కిట్స్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సరఫరా చేసి వారి ప్రాణాలను కాపాడాలన్నారు. అదేవిధంగా ఆరోగ్య సిబ్బందిగా పనిచేస్తున్న వారందరికీ కూడాను వారి నెల జీతంతో పాటుగా మరొక నెల జీతాన్ని అదనంగా కలిపి మొత్తం రెండు నెలల జీతం ఇవ్వవలసినదిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోన్నదన్నారు.

కరోనా బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందించి ఈ కష్టకాలంలో వారిని ఆదుకోవాలన్నారు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అవసరమైతే విదేశాల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసి రాష్ట్రంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయించి ప్రజలకు పొంచివున్న మూడో దశ నుంచి రక్షణ కల్పించాలని శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. గత నెలరోజులుగా దేశం మొత్తం కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కేంద్రం 10 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి దొంగదెబ్బ తీసిందని శైలజానాథ్ విమర్శించారు. కరోనాతో దేశం అతలాకుతలం అవుతుంటే ఆదుకోవాల్సిన మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను దోచుకోవడం దుర్మార్గమన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో నిత్యావసర ధరలు మరింత భారమయ్యాయన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి