జనవిజయంతెలంగాణబి.వి.కె. ఐసోలేషన్ సెంటర్ కి రాయల నిత్యావసర సరుకుల వితరణ

బి.వి.కె. ఐసోలేషన్ సెంటర్ కి రాయల నిత్యావసర సరుకుల వితరణ

ఖమ్మం, జూన్ 6(జనవిజయం): ఖమ్మం జిల్లా కేంద్రం, నిర్మల్ హృదయ్ స్కూల్ లో బి.వి.కె. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ కి ముదిగొండ మండలం, ముదిగొండ, వెంకటాపురం గ్రామాల సిపిఎం గ్రామ శాఖల ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు సహకారంతో దాదాపు 500 మందికి సరిపడా ఒక రోజు సరుకులు, చికెన్, పండ్లు, రైస్, ఇతర సామాగ్రి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాయల వెంకటేశ్వర్లుకి, సిపిఎం ముదిగొండ, వెంకటాపురం గ్రామ శాఖలకు సిపిఎం ఖమ్మం జిల్లా కమిటి , బివికె ఐసోలేషన్ సెంటర్ తరుపున ధన్యవాదాలు తెలియజేశారు. దాతల సహకారంతో ఐసోలేషన్ సెంటర్ లో ఉన్న బాధితులకు మాత్రమే కాక, ఇళ్ళ వద్ద హెూం ఐసొలేషన్లో వున్న ఇతర కోవిడ్ బాధితుల ఇళ్ళకు, హస్పిటల్ లో వుంటున్న వారికి హాస్పిటలకు సుమారు 500 భోజనం పార్సిల్స్ పంపుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సెంటర్ లో దాదాపు 25 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బండి రమేష్, బివికె ఐసోలేషన్ సెంటర్ బాధ్యులు శ్రీనివాసరావు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ, సిపిఎం మండల కార్యదర్శి వాసిరెడ్డి ప్రసాద్, నాయకులు భాస్కర్ రావు, నాగేశ్వరరావు, రవి,పురుషోత్తం, మర్లపాటి వెంకటేశ్వర్లు, పద్మ, కళ్యాణ్, భద్రయ్య, డివైఎఫ్ఎ నాయకులు బట్టు రాజు, సత్తుపల్లి నరేష్, కణపర్తి గిరి, మేట్టేల సతీష్, షరీఫ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి