జనవిజయంతెలంగాణబివికె ఐసోలేషన్ కేంద్రానికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేత

బివికె ఐసోలేషన్ కేంద్రానికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేత

ఖమ్మం,జూన్4(జనవిజయం) : కరోనా బాధితులకు సేవచేస్తున్న బోడేపూడి విజ్ఞాన కేంద్రం కు  2 లక్షల రూపాయలు విలువ చేసే “ఆక్సిజన్ కాన్సెంట్రేటర్” ను శుక్రవారం సి.పి.ఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అందజేశారు. కరోనా వైరస్ సోకి అనేకమంది ప్రజలు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం హాస్పిటల్స్ లో సరిపడ ఆక్సిజన్ సరఫరా కూడా ప్రభుత్వం సమకూర్చటంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా రోగులకు ఆక్సిజన్ అత్యవసరం అని భావించి హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం సహయ సహకారంతో దీనిని బివికె మేనేజర్ వై. శ్రీనివాసరావుకు సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అందజేశారు. అత్యవసర పరిస్థితిలో ఆక్సిజన్ సేకరించి సహాయం అందించిన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్ర బాధ్యులకు మరియు పార్టీ జిల్లా నాయకులకు బివికె బాధ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బషీర్, బివికె బాధ్యులు రామారావు, వాసిరెడ్డి వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి