జనవిజయంతెలంగాణపుట్టినరోజు వేడుకల సందర్భంగా నర్రా హాసిని బివికె ఐసొలేషన్ కు రూ.25,000/- వితరణ

పుట్టినరోజు వేడుకల సందర్భంగా నర్రా హాసిని బివికె ఐసొలేషన్ కు రూ.25,000/- వితరణ

  • కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే ఆలోచనవైపు యువత రావడం మంచి పరిణామం
  • బర్త్ డే వేడుకలను మానుకొని సరికొత్త ఆలోచన చేస్తున్న యువత, చిన్నారులు
  • అభినందనలు తెలిపిన సిపిఎం నేతలు పోతినేని సుదర్శన్ రావు, నున్నా నాగేశ్వరరావు

ఖమ్మం, మే 26 (జనవిజయం): ఖమ్మం నగరానికి చెందిన నర్రా హాసిని తన 13వ పుట్టినరోజు వేడుక సందర్భంగా కష్టాల్లో ఉన్న కోవిడ్ రోగులకు సేవలు అందిస్తన్న బివికె ఐసొలేషన్ సెంటర్‌కు రు.25,000/-లు అందించారు. హాసిని తల్లిదండ్రులు నర్రా శ్రీధర్, స్వాతిలు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. హాసిని తరఫున తాత, అమ్మమ్మ యెనిగండ్ల శ్రీనివాసరావు, జయలక్ష్మి లు రు. 25,000/-లను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుల చేతికి అందించారు.

ఈ సందర్భంగా పోతినేని, నున్నా మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలు కోవిడ్ బారిన పడి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, అట్లాంటి వారికి అండగా ఉండటం కోసం బివికె ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తలపెట్టిన ఐసొలేషన్ సెంటర్ కు మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. యువత ఆలోచనలో మార్పు మొదలైందని కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండటం కోసం పుట్టిన రోజు వేడుకలను మానుకొంటున్నారని, దానికి అయ్యే ఖర్చును సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనే ఆలోచన యువత, చిన్నారుల్లో వస్తుందని తెలియజేశారు.

బివికె కు రు.25,0000/-లు ఇచ్చిన హాసిని కుటుంబ సభ్యులు తాత, నాయనమ్మ నర్రా పూర్ణచంద్రరావు (లేట్), ప్రభావతి, తాతా, అమ్మమ్మలు యెనిగండ్ల శ్రీనివాసరావు, జయలక్ష్మి, తల్లిదండ్రులు నర్రా శ్రీధర్, స్వాతిలను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్, బండి పద్మ, విష్ణువర్ధన్, మెరుగు సత్యనారాయణ, పారుపల్లి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి