జనవిజయంతెలంగాణబివికె కోవిడ్ ఐసొలేషన్ సెంటర్‌కు పలువురు దాతల వితరణ

బివికె కోవిడ్ ఐసొలేషన్ సెంటర్‌కు పలువురు దాతల వితరణ

ఖమ్మం, జూన్18(జనవిజయం): ఖమ్మం నగరంలోని బోడేపుడి విజ్ఞాన కేంద్రం(బి.వి.కె)కు పలువురి మన్ననలతోపాటు వితరణలు పెరుగుతుండడం ఆహ్వానించదగిన పరిణామంగా ఉంది. బి.వి.కె ఆధ్వర్యంలో గత 37 రోజులుగా కరోనా బాధితులకు ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి వారికి కావలసినవి అన్ని అందిస్తూ, వారిలో ధైర్యాన్ని నింపి, వారికి కరోనా పూర్తిగా తగ్గేవరకూ
సెంటర్ లో ఉంచి సేవలు చేస్తుండటం అభినందనీయం. దీనికి తోడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోవిడ్తో బాధపడుతున్న వారికి ఇంటింటికి, హస్పిటలకు దాదాపు 500కు పైగా భోజనాలు అందించడం నిత్యం అందిస్తున్నారు. వీరికి కూడా బి.వి.కె సహకారం ఉండడం జరుగుతుండడం గమనార్హం. బి.వి.కె కార్యక్రమాలకు నిత్యం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఇతర ప్రజాసంఘాల వాలంటీర్లు చేస్తున్న సర్వీపులు కూడా పలువురిచేత ప్రశంసలు పొందుతున్నాయి. అనేకమంది దాతలు మంచి మనసుతో అడగకుండానే సహాయం చేస్తున్నారని బివికె జనరల్ మేనేజర్ వై. శ్రీనివాసరావు అన్నారు. వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. దీనిలో భాగంగా శుక్రవారం కూడా కొందరు దాతలు బి.వి.కె కు వితరణగా వివిధ రకాలుగా సహాయం అందజేశారు. ఆ వివరాలను శ్రీనివాసరావు జనవిజయంకు తెలిపారు. శుక్రవారం దాతల వివరాలలోకి వెళితే తాళ్ళూరి రాములు 25కేజీల బియ్యం,  ఆనందాచారి-సుమతి దంపతులు వారి స్నేహితులు రాధిక, స్పందనలు 25 కేజీల బియ్యం, 15కేజీల మంచి నూనె ఇవ్వటం జరిగింది. ఐద్వా నాయకులు భారతి, రాజ్యలక్ష్మి, ఝాన్సీ వారి స్నేహితులు కలసి రు.5000/ విరాళంగా ఇచ్చారు. తిరుమలపూడి మాణిక్యాంబ 18వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు టి.ఎస్ యు.టి.ఎఫ్ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, వారి కోడలు ఎన్కూర్ టీ.ఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షురాలు లక్ష్మి కుమారి దంపతులు 25 కేజీల చికెన్ వితరణగా ఇవ్వటం జరిగింది. మల్లంపాటి ధనమ్మ జ్ఞాపకార్ధం వారి మనవడు మల్లంపాటి రాజేష్ రు. 15000/- వితరణగా అందజేశారు. చల్లా బాబురెడ్డి-లీలావతి దంపతులు ఐద్వా 1టౌన్ కమిటి ప్రోత్సాహంతో 1క్వింటాలు బియ్యం, 15కేజీల మంచి నూనెను విరాళంగా అందజేశారు.  ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నాగారు నాగేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, ఐద్వా రాష్ట్ర నాయకులు బత్తుల హైమవతి గార్లు పాల్గొని ప్రసంగించారు. దాతలకు, వలంటీర్లకు, నిర్వాహకులకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. వీరి స్పూర్తితో మరింత మంది దాతలు ముందుకు రావాలని ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులలో చేయీ చేయీ కలిపి బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి పద్మ, మాచర్ల భారతి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్, బివికె జనరల్ మేనేజర్ వై. శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, రమణ, నందిపాటి మనోహర్, డివైఎస్ఏ జిల్లా నాయకులు ఇంటూరి అశోక్, కణపర్తి గిరి, కూరపాటి శ్రీను, గుమ్మా ముత్తారావు, వేముల సాంబ, సిపిఎం 1వ టౌన్, అర్బన్ మండల కార్యదర్శులు ఎం.ఎ. జబ్బార్, షేక్ వలి మీరా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, బివికె సిబ్బంది రామారావు, వాసిరెడ్డి వీరభద్రం, జాన్, వెంకటరావు, ఐద్వా నాయకురాళ్ళు భాగం అజిత, సరస్వతి, బేగం తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి