జనవిజయంతెలంగాణవలంటీర్ సర్వీస్ తో పాటు విరాళాలు ఇవ్వడం స్పూర్తిదాయకం - డి.వై.ఎఫ్.ఐ కార్యకర్తలను అభినందించిన ఐద్వా...

వలంటీర్ సర్వీస్ తో పాటు విరాళాలు ఇవ్వడం స్పూర్తిదాయకం – డి.వై.ఎఫ్.ఐ కార్యకర్తలను అభినందించిన ఐద్వా నాయకురాలు బుగ్గవీటి సరళ

ఖమ్మం జూన్ 17(జనవిజయం): డి.వై.ఎఫ్.ఐ వాలంటీర్ల సర్వీస్ చేయడంతో పాటు, విరాళాలు కూడా ఇవ్వటం అభినందనీయమని ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ  ప్రశంసించారు. నగరంలోని బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఐసోలేషన్ సెంటర్ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ) ఆధ్వర్యంలో 25కేజీల బియ్యం విరాళం గా ఇచ్చారు. ఈ బియ్యంను డి.వై.ఎఫ్.ఐ నాయకులు రణం మధు అందజేశారు. ప్రస్తుతం రణం మదు మేడికల్ రిప్రజేంట్ గా పనిచేస్తున్నారు. బి.వి.కె ఐసోలేషన్ సెంటర్ పని, డి.వై.ఎఫ్.ఐవాలంటీర్లు చేస్తున్న పనిని చూసి తాను కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఈ చిరు సహయం చేసినట్లు మదు తెలియజేశారు.  ఈ సందర్భంగా సరళ మాట్లాడుతూ  డి.వై.ఎఫ్.ఐ స్పూర్తితో యువత కరోనా సేవలో ముందండాలని కోరారు. ఈ కార్యక్రమం లో రైతు సంఘం జిల్లా నాయకులు బండి రమేష్, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి పద్మ, మాచర్ల భారతి, డి.వై.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, బి.వి.కె జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు, వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, రమణ, డి.వై.ఎఫ్.ఐ జిల్లా నాయకులు ఇంటూరి అశోక్, కణపర్తి గిరి, కూరపాటి శ్రీను, గుమ్మా ముత్తారావు, కణతాల వెంకటేశ్వర్లు, సి.ఐ.టి.యు నాయకులు నవీన్ రెడ్డి, వ్వవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి