జనవిజయంఆంధ్రప్రదేశ్బుర్రిపాలెంలో వైద్య సేవలకు శ్రీకారం చుట్టిన బాబు

బుర్రిపాలెంలో వైద్య సేవలకు శ్రీకారం చుట్టిన బాబు

సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు విషెస్ తెలిపిన తనయుడు మహేశ్ బాబు సొంతూరు బుర్రిపాలెంలో వైద్యసేవలకు శ్రీకారం చుట్టారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సొంతూరు బుర్రిపాలెంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. కొవిడ్ కారణంగా అభిమానులు, సన్నిహితులు కృష్ణ బర్త్ డే వేడుకలను నిర్వహించడం లేదు. సోషల్ మీడియాలోనే ఆయనకు పుట్టిన రోజు అభినందనలు తెలియజేస్తున్నారు. ఎప్పటిలాగానే కృష్ణకు ఆయన తనయుడు, సూపర్‌స్టార్ మహేశ్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే నాన్నా….. నేను ముందుకెళ్లడానికి నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీకు తెలియనంతగా మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తుంటాను అని ట్వీట్ చేస్తూ తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు మహేశ్. నిజానికి మహేశ్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ నుంచి టీజర్‌ను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా వేశారు. ఇకపోతే సూపర్ స్టార్ మహేశ్ తన స్వగ్రామం బుర్రిపాలెంని దత్తత తీసుకుని తనవంతు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. కేవలం బుర్రిపాలెం వాసులకే కాదు, మహేశ్ తనవంతు సామాజిక కార్యక్రమాల్ని నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి 1000 మందికి పైగా పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించారు. హీల్ ఎ చైల్డ్ ఫౌఫౌండేషన్’ సంస్థతో కలిసి ఆర్థిక అండదండలు లేక వైద్య ఖర్చులను భరించలేని ఎంతో మంది చిన్నారుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. సోమవారం తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బుర్రిపాలెం ప్రజల కోసం కోవిడ్ -19 టీకాల పూర్తి డ్రైవ్ ను స్పాన్సర్ చేశారు మహేశ్. ఆంధ్రప్రదేశ్ లో బుర్రిపాలెం మరియు తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. అతను ఆ గ్రామాల్లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను అభివృద్ధి చేసే బాధ్యతలను స్వీకరించడం ద్వారా శ్రీమంతుడిగా నిరూపించుకుంటున్నారు. తన తండ్రి కృష్ణ పుట్టిన రోజున మహేష్ ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో బుర్రిపాలెం గ్రామస్తులకు కోవిడ్ -19 టీకాల పూర్తి డ్రైవ్ ను స్పాన్సర్ చేశారు. సాహసమే ఊపిరిగా ఎన్నో కొత్త ఒరవడులు సృష్టించి సంచలన విజయాలు సాధించిన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ తన 78వ పుట్టిన రోజును సోమవారం సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన 78వ బర్త్ డే సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సెలెబ్రిటీలు కృష్ణకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియ జేసారు. కోడలు నమ్రతా శిరోద్కర్, ఆయన కూతురు ఘట్టమనేని మంజుల, మెగాస్టార్ చిరంజీవి, అడివి శేష్, ఈషా రెబ్బా, అనిల్ రవిపుడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా సూపర్ స్టార్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.

“టీ​కా అనేది మళ్లీ సాధారణంగా జీవించడానికి అవసరమైన ఆశాకిరణం వంటిది. బుర్రిపాలెం ప్రజలు టీకా వేసుకుని సురక్షితంగా ఉండాలని నేను చేస్తున్న చిన్న ప్రయత్నమిది. ఈ టీకా డ్రైవ్‌ ఏర్పాటుకు సహకరించిన ఆంధ్రా హాస్పిటల్స్‌కు, క్లిష్ట కాలంలో స్వచ్చందంగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించిన టీమ్‌ మహేశ్‌బాబు సభ్యులకు ప్రత్యేక అభినందనలు” అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి