బి ఎస్ ఎన్ ఎల్ లో 4జి మరియు 5జి ని వెంటనే అమలు చేయాలి!మానవ హారం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి!
.. టి.దుర్గారావు ,బి ఎస్ ఎన్ ఎల్ జాయింట్ ఫోరమ్ చైర్మన్ ఖమ్మం..
జనవిజయం, 29 మే (ఖమ్మం): బి ఎస్ ఎన్ ఎల్ లో మూడవ వేతన సవరణ, 4జి,5జి ఏర్పాటు, నాన్ ఎగ్జిక్యూటివ్ లకు న్యూ ప్రమోషన్ పాలసీ అమలు లాంటి పెండింగ్ సమస్యలపై అల్ ఇండియా జాయింట్ ఫోరమ్ (యూనియన్స్&అసోసియేషన్స్) ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం నగరంలో మానవహారం కార్యక్రమాన్ని జూన్ 1 న చేబడుతున్నట్లు టి . దుర్గారావు,బి ఎస్ ఎన్ ఎల్ జాయింట్ ఫోరమ్ చైర్మన్ ఖమ్మం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ..,ఈ కార్యక్రామనికి వర్కింగ్ ఎంప్లాయిస్ , రిటైర్డ్ ఎంప్లాయిస్ మరియు అన్నీ అసోసియేషన్ లు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని తెలిపారు.