భద్రాచలం గడ్డమీద కారు గుర్తును గెలిపించుకుంటాం!
..ముఖ్య కార్యకర్తల సమావేశంలో వక్తలు…
మాజీ ఎం.ఎల్.సి బాలసాని లక్ష్మీనారాయణను భద్రాచల నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా ఉంచాలని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
భద్రాచలం 02 ఆగస్ట్( జనవిజయం) : భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అరకిల తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి పాల్గొని మాట్లాడుతూ., పార్టీ నియమ నిబంధనలను పార్టీ కార్యకర్తలు అందరము తప్పకుండా పాటిస్తామని, పార్టీని గెలిపించుకోవడానికి ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని.. పార్టీ అభ్యర్థిని భద్రాచలం గడ్డమీద గెలిపించుకోవడానికి అందరం కలిసి కృషి చేస్తామని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీని కలుపుకొని పోవాలని పార్టీ అభ్యర్థి అయిన తేల్లం వెంకట రావు కి సూచించారు. వేరేవారి క్యాంపు కార్యాలయం గా ముద్ర పడిన భవనంలో పార్టీ సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను అయోమయానికి గురిచేయొద్దని తెలిపారు.అంతేకాదు బాలసాని లక్ష్మీనారాయణ భద్రాచల నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా ఉంచాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు తిప్పన సిద్ధులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోధబోన బుచ్చయ్య, మాజీ మండల అధ్యక్షులు యశోద నాగేష్ , అభయాంజనేయ స్వామి కమిటీ చైర్మన్ తాళ్ల రవికుమార్, గ్రంథాలయం చైర్మన్ మామిడి పుల్లారావు, విద్యార్థి డివిజన్ నాయకులు ఎండి బషీర్, కనకదుర్గ అమ్మవారి చైర్మన్ చింతాడ రామకృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ లకావత్ వెంకటేశ్వర్లు, మహిళా మండలి ప్రధాన కార్యదర్శి ములకలపల్లి మదారి, మహిళా సీనియర్ నాయకులు కేతినేని లలిత, ఎండి ముంతాజ్, ఈర్ల భారతి ,బుక్యా శ్వేత, సాయి అనురాధ ,సత్యవేణి, సీతామాలక్ష్మి, బేగం, మరియమ్మ, రాజ్యం, సీత, ముస్లిం మైనార్టీ నాయకులు మస్తాన్ రెహ్మాన్, మున్నాభాయ్, మామిళ్ళ రాంబాబు, ఒగ్గు రమణ , జానీ, కోటయ్య, ఉద్యమ నాయకులు సాయిబాబు, నాగేందర్ , నవీన్, ఆనంద్ బాబు ,ఎస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల శ్రీనివాస్ , ఎలక్ట్రికల్ నాయకులు ఆనంద్ బాబు తదితరులు పాల్గొనడం జరిగినది.