Saturday, February 24, 2024
Homeరాజకీయంబిఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదు – బిజెపి నేత బండి సంజయ్

బిఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదు – బిజెపి నేత బండి సంజయ్

  • తెలంగాణలో బిఆర్.ఎస్ ది మూడో స్థానమే
  • బిజెపి కార్యదర్శి బండి సంజయ్‌ వెల్లడి

కరీంనగర్‌,ఫిబ్రవరి12(జనవిజయం): తెలంగాణలో తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవని పొత్తులపై బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ తో పొత్తులతో కలసి వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కరీంనగర్‌లో విూడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని.. బీజేపీతో పొత్తు ఉంటుందని బీఆర్‌ఎస్‌ నేతలు సిగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునే మూర్ఖత్వపు పార్టీ తమది కాదన్నారు. ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పుకునే దమ్ము బీఆర్‌ఎస్‌కు లేదని అన్నారు. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికలు రాగానే ప్రజలను మభ్యపెడుతున్నారని, ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ది మూడో స్థానమేనని, మూడో స్థానానికి వెళ్లే పార్టీతో పది స్థానాలు గెలిచే బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కొత్త డ్రామాలు ఆడుతున్నాయని బండి సంజయ్‌ అన్నారు. ఇదిలావుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో శ్రీ మార్కండేయ స్వామి వారి ఆలయం పవర్‌ ఫుల్‌ గా మారనుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. అయోధ్య శ్రీరామ మందిరానికి ఎంతో మంది భక్తులు సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఈ మార్కండేయ గుడికి కూడా సహాయ సహకారాలు అందించాలని కోరారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని ఎంపీ బండి సంజయ్‌ దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో  ఆలయ అర్చకులు, పద్మశాలి సంఘం నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సిరిసిల్ల పద్మశాలి నాయకుల ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ స్వామివారి ఉత్సవాలు, శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవాలయ నిర్మాణానికి భక్తులు అందరూ భాగస్వాములు అవ్వాలని కోరారు. గుడి నిర్మాణానికి తనవంతు సహాయం అందిస్తానన్నారు ఎంపీ బండి సంజయ్‌.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments