Saturday, February 24, 2024
Homeవార్తలుడాక్టర్ తెల్లం గెలుపు ఖాయం .... BRS సీనియర్ నాయకులు కడియం రామాచారి....

డాక్టర్ తెల్లం గెలుపు ఖాయం …. BRS సీనియర్ నాయకులు కడియం రామాచారి….

భద్రాచలానికి KTR వచ్చి వెళ్లిన తరువాత BRS లోకి వలసలు మొదలయ్యాయి

 

డాక్టర్ తెల్లం గెలుపు ఖాయం.… BRS సీనియర్ నాయకులు కడియం రామాచారి….

 భద్రాచలం, 24 నవంబర్(SK అహ్మద్: జనవిజయం)      భద్రాచలం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార జోరు ఉఉపాండుకుంది.రెండు ప్రధాన పార్టీలు BRS మరియు కాంగ్రెస్ నువ్వా….? …నేనా..?? అన్నట్లు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటాపురం,వాజీడు దుమ్ముగూడెం మొదలైన మండలాల్లో సీనియర్ అడ్వెట్ సున్నం రమేష్ ఆధ్వర్యంలో అప్పలరాజు , కడియం రమాచారి సహకారం తో   100 గ్రామాలలో BRS పార్టీ తరుపున విస్తృత ప్రచారం కొనసాగించారు.అంతే కాదు  ఈ ప్రచారాన్ని ప్రతీ గిరిజన గ్రామాలకి(వారికి పరిచయం మరియు బంధువులు ఉన్న గ్రామాలు) విస్తరింపజేస్తూ రాష్ట్ర సంక్షేమ పథకాలను , KCR దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలను ఆదివాసీ భాషలోనే వివరిస్తున్నారు.ఈ ప్రాంతం నుండి ఓ మాజీ MLC కాంగ్రెస్ పార్టీలో చేరిన్నటికీ BRS పార్టీ పట్టు కోల్పోలేదని BRS సీనియర్ నాయకులు కడియం రమాచారి తెలిపారు. దుమ్ముగూడెం, వెంకటాపురం మరియు వాజీడు మండలాల్లో ఉన్న సుమారు 60 వేల ఓట్ల పై మా ప్రచార ప్రభావం ఉన్నట్లు కడియం అన్నారు. అంతే కాదు భద్రాచల నియోజకవర్గం లో ప్రతీ గ్రామంలో ఉన్న దళితులకు పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఏజెన్సీ లో దళితులకు BRS అంటే భరోసా ఏర్పడిందని మరియు KTR ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం వచ్చినప్పుడు నా పేరే “తారక రాముడు” భద్రాచలానికి అన్యాయం చేస్తామా ..భద్రాచల అభివృద్ధికి కట్టుబడి ఉంటాం అని హామీ ఇవ్వడం వలన భద్రాచలం ప్పట్టణంలో కూడా BRS లోకి వలసలు భారీగా ఉన్న దృష్ట్యా డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపు ఖాయం అని BRS సీనియర్ నాయకులు కడియం  రమాచారి 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments