- అనాధలకు పండ్లు,బియ్యం పంపిణీ
వేంసూరు, ఆగస్ట్15 (జనవిజయం): మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాలా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య జన్మదినం సందర్భంగా మంగళవారం స్థానిక మండల కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు కేక్ కట్ చేసి సండ్ర జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.అనంతరం మండల కేంద్రంలోని అనాధ శరణాలయంలో వృద్దులకు పండ్లు, బియ్యం, స్వీట్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో వేంసూరు మండల బి ఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
