ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్రాహ్మణ సభను జయప్రదం చేయండి!
..రామావజ్జల రవికుమార్ శర్మ రాష్ట్ర అధ్యక్షులు, బి.రామాచార్యులు రాష్ట్ర కార్యదర్శి,గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం..
జనవిజయం, 14 మే(ఖమ్మం): ఈనెల 16వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మం నగరంలోని గాయత్రి భవన్ లో జరగబోవు ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్రాహ్మణ సదస్సును జయప్రదం చేయవలసిందిగా గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామావఝల రవికుమార్ శర్మ మరియు బి.రామాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశంలో ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణుల స్థితిగతులు మరియు ఇతర అంశాలపై కూలంకష చర్చలు జరుగుతాయని తెలిపారు.
ఈ సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ గర్నెపూడి శ్రీరామ్ శర్మ మరియు ఇతర బ్రాహ్మణ ప్రముఖులు హాజరవుతున్నారని
కావున బ్రాహ్మణ సమాజానికి చెందిన ఉద్యోగులు, న్యాయవాదులు,వైద్యులు,విద్యార్థులు,పురోహితులు,అర్చకులు,డిడిఎన్ కమిటీ సభ్యులు,వంటవారు మరియు బ్రాహ్మణ సమాజానికి చెందిన అన్ని వర్గాల వారు ఈ సమావేశానికి హాజరై జయప్రదం చేయవలసినదిగా పిలుపునిచ్చారు.