- ఆర్ఎంపీలకు దళిత బందు,బి.సి బందులాంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలి
- 428 జీవో ని సవరించి శిక్షణ ఇవ్వాలని డిమాండ్
- అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామీణ వైద్యులు
బోనకల్, జూలై 16(జనవిజయం) :
మండల పరిధిలోని రావినూతల గ్రామంలో రైతు వేదిక నందు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్వర్యంలో సీజనల్ వ్యాధుల మీద అవగాహన పై మండల అద్యక్షుడు యంగల గౌతం అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండలంలోని గ్రామీణ వైధ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్ఎంపీ డబ్ల్యూ టీ ఏస్ రాష్ట్ర కన్వీనర్ రుద్రగాని ఆంజనేయులు,జిల్లా అధ్యక్షుడు బొమ్మినేని కొండలరావు, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాసరావు లు మాట్లాడుతూ ఐఎంఏ వాళ్లు ఎచ్ఆర్డిఏ వాళ్ళు ఆర్ఎంపీలకు శిక్షణ ఇయ్యారాదన్న వ్యాఖ్యలు సమంజసం కాదని ,ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నామని,మా భృతిని తీసివేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.ప్రభుత్వం ఆర్ఎంపీ లకు ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి లేదని,428 జీవో ప్రకారం ఆర్ఎంపీ వైద్యులు సూది వేయవద్దని,దూది,కట్టు గుడ్డ మాత్రమే ఉండాలని ప్రభుత్వం చెప్తుందని, ఆర్ఎంపీ వైద్యులకు ఇది ఆమోదం కాదని ఈ జీవోని సవరించి శిక్షణ ప్రారంభించాలని అన్నారు.దళిత బందు,బి.సి బందు లాంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలని, ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పని చేస్తున్న ఆర్ఎంపీ లను ప్రభుత్వ కార్యక్రమాలలో ఉపయోగించుకోవాలని, 50స”లు దాటిన ఆర్ఎంపీ వైద్యులకు నెల కు 5వేలు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జె డి మూర్తి, షేక్ హసన్,ఎస్ వి రామారావు.ప్రచార కార్యదర్శి గండారపు రామారావు,గోపి, ఖాసిం,తదితరులు ఆర్ఎంపీ వైద్యులు పాల్గొన్నారు.
