Friday, April 18, 2025
Homeవార్తలుమండల కేంద్రంలో ఘనంగా రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ జయంతి వేడుకలు

మండల కేంద్రంలో ఘనంగా రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ జయంతి వేడుకలు

  • ఘన నివాళులర్పించిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు

బోనకల్,ఏప్రిల్14(జనవిజయం) : రాజ్యాంగ రూపశిల్పి,భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. బోనకల్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కుల సంఘాల నాయకులు,వివిధ పార్టీల ప్రతినిధులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

సీపీఎం ఆధ్వర్యంలో : రావినూతల గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం, కెవిపిఎస్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు మధిర డివిజన్ గుడిపల్లి గోపాలరావు,జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు,మండల కార్యదర్శి కిలారి సురేష్ లు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు,

బీజేపీ ఆధ్వర్యంలో: రావినూతల గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ మండల అధ్యక్షురాలు తాళ్లూరి మౌనిక సురేష్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ, మధిర అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ ఏలూరు నాగేశ్వరరావు లు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు,

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో: మండల కేంద్రంలో పంచాయతీ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు ఆధ్వర్యంలో మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొని పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళి అర్పించారు,

ఎమ్మార్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో: మండల పరిధిలోని జానకిపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు,

ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటరానివారుగా పరిగణించబడే పేద కుటుంబంలో పుట్టినా ఎదురుచూపులు కాచుకుంటూ ఎదిగి వచ్చారన్నారు. సాంఘిక పరమైన ఆర్థికపరమైన అవమానాలతో నిరంతరం పోరాడుతూ స్వయంకృషితో పైకి వచ్చారు.ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ విదేశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసి జాతి గర్వించే స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల ముఖ్య నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments