జనవిజయంఆరోగ్యంతలసేమియా బాధితులకై రక్తదాన శిబిరం నడిపిన చొప్పకట్లపాలెం యూత్

తలసేమియా బాధితులకై రక్తదాన శిబిరం నడిపిన చొప్పకట్లపాలెం యూత్

బోనకల్,సెప్టెంబర్ 3 (జనవిజయం): తలసేమియా బాధితుల కోసం బోనకల్ మండలం చొప్పకట్లపాలెం యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 24 మంది రక్తదానం చేశారని నిర్వాహకులు బోయనపల్లి పవన్ కుమార్, దుడ్డు విజయ్ కుమార్, వజ్రాల వెంకట నవీన్, బాలు సాయి, బాలు జశ్వంత్, బోయనపల్లి వరుణ్ తేజ లు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఖమ్మంకు చెందిన సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో జరిగింది. రక్తదానం చేసిన వారిలో బోనకల్ ఎస్.ఐ కొండలరావు, సర్పంచి యర్రంశెట్టి సుబ్బారావు, సి.పి.ఎం నాయకులు కిలారు సురేష్, పల్లెప్రపంచం సర్వీసెస్ కోశాధికారి కొండేటి అప్పారావు, సభ్యురాలు పొన్నం ఆమనిలతో పాటు గ్రామ యువకులు తుపాకుల నరేష్, పర్సగాని గోపి, బోయనపల్లి వెంకటరావు, కొండేటి గోపి, బండి ప్రవీణ్, తెల్లబోయిన గురవయ్య, చామర్తి సాయికృష్ణ, తన్నీరు నవనీష్, వడ్డెబోయిన బాలాజీ, బోయనపల్లి నాగుల్ మీరా, మర్రి అభిషేక్, దారెల్లి వెంకటసాయి, గరపాకుల సతీష్, కొండేటి ప్రవీణ్, ఏసుపోగు ఉదయ్, దుడ్డు విజయ్ కుమార్, బాలు సాయికృష్ణ, వజ్రాల వెంకట నవీన్, ముష్టికుంట్ల గ్రామానికి చెందిన కొట్టె ప్రశాంత్ లు ఉన్నారు. రక్తదానం చేసినవారికి గ్రామ సిపిఎం నాయకులు ఉన్నం వెంకటేశ్వర్లు ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను, సిపిఎం మండల నాయకులు కిలారు సురేష్ పండ్లను పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం నిర్వహించిన యూత్ , రక్తదానం చేసిన వారిని ఎస్.ఐ కొండలరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో పల్లెప్రపంచం సర్వీసెస్ అధ్యక్షులు పల్లా కొండలరావు, ఎం.పి.టి.సి కోటపర్తి హైమావతి, సర్పంచి యర్రంశెట్టి సుబ్బారావు, సిపిఎం నాయకులు చలమల అజెయ్ కుమార్, బోయనపల్లి పున్నయ్య, చలమల హరికిషన్ రావు, టీఆర్ఎస్ నాయకులు కొణకంచి నాగరాజు, సంకల్ప స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రవి తదితరులు పాల్గొన్నారు.

                                                      రక్తదానం చేస్తున్న బోనకల్ ఎస్.ఐ కొండలరావు

                   రక్తదానం చేస్తున్న చొప్పకట్లపాలెం గ్రామ సర్పంచి యర్రంశెట్టి సుబ్బారావు

                            రక్తదానం చేస్తున్న సిపిఎం మండల నాయకులు కిలారు సురేష్

                           రక్తదానం చేస్తున్న పల్లెప్రపంచం సభ్యురాలు పొన్నం ఆమని

                        రక్తదానం చేస్తున్న తుపాకుల నరేష్, ఓఆర్ఎస్ పంపిణీ చేసిన ఉన్నం వెంకటేశ్వర్లు

                           రక్తదాన శిబిర నిర్వాకులు : చొప్పకట్లపాలెం యూత్ సభ్యులు

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి