జనవిజయంజాతీయంఢిల్లీలో విస్తరిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌

ఢిల్లీలో విస్తరిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌

  • వివిధ ఆస్పత్రుల్లో 197 కేసు నమోదు
  • వెల్లడించిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌

న్యూఢిల్లీ,మే21(జనవిజయం): దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో 197 బ్లాక్‌ ఫంగస్‌ కేసు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ శుక్రవారం తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొవిడ్‌ చికిత్స కోసం స్టెరాయిడ్లు తీసుకోవాని, వైద్యుల సూచన మేరకు వాడాని, ప్రొఫెషనల్‌ను సంప్రదించకుండా వాడడం సరికాదన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ రెండు కారణాతో సోకుతుందని.. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెగరడం వల్ల, సెర్టాయిడ్ల వాడకంతోనని తెలిపారు. వైద్యుల సలహా మేరకే తీసుకోవాలని సూచించారు. ఫంగస్‌ మట్టిలో, కుళ్లిపోయిన వస్తువుల్లో కనిపిస్తుందన్నారు. ఇది ఆరోగ్యకరమైన వ్యక్తిపై ప్రభావం చూపదన్నారు. స్టెరాయిడ్స్‌ వాడి, మానివేసిన వారంతా కనీసం వారం రోజులు ఇల్లు విడిచి వెళ్లొద్దని సూచించారు. ఇదిలా ఉండగా.. దేశ రాజధానిలో కొవిడ్‌`19 కేసుపై స్పందిస్తూ.. కొవిడ్‌ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.5శాతంగా ఉందని తెలిపారు. కొత్తగా 3,231 కేసు నమోదయ్యాయని తెలిపింది. రోజువారి కేసులు 28వేల నుంచి మూడువేలకు పడిపోయాయని.. 36శాతం వరకు పెరిగిన పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.5శాతానికి తగ్గిందన్నారు. ప్రజలు వైరస్‌ తగ్గుముఖం పట్టిందని, తేలిగ్గా తీసుకోవద్దన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్‌ ప్రవర్తనా నియమాలను పాటించాలని సూచించారు. 18`44 మధ్య వయస్సు వారికి టీకాలు వేసేందుకు అందుబాటులో లేవని, త్వరలోనే డోసు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి