జనవిజయంజాతీయంబ్లాక్ డేకు సిపిఎం మద్దతు

బ్లాక్ డేకు సిపిఎం మద్దతు

కేంద్ర విధానాలు ఎండగట్టడానికి నిరసనలు

అనంతపురం,మే24(జనవిజయం): ఈ నెల 26న ఆల్ ఇండియా రైతు కార్మిక సంఘాలు చేపట్టనున్న బ్లాక్ డే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం దక్షిణ జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ పిలుపునిచ్చారు. సోమవారం హిందూపురంలోని స్థానిక సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ… మోడీ ప్రభుత్వం దేశ రైతాంగానికి నష్టం కలిగించే విధంగా తీసుకొచ్చిన మూడు నల్ల రైతు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ఈ నెల 26 న జరగనున్న బ్లాక్ డే ను జయప్రదం చేయాలని కోరారు. మే 26 న ఆల్ ఇండియా రైతు కార్మిక సంఘాలు చేపట్టనున్న బ్లాక్ డే కార్యక్రమానికి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు. బ్లాక్ డే సందర్భంగా ప్రతి గ్రామంలో రైతులు, కార్మికులు నల్లజెండాలను ఎగురవేస్తూ నిరసన వ్యక్తం చేయాలన్నారు. మండల కేంద్రాలలో మోడీ దిష్టి బమ్మను దగ్ధం చేస్తూ నిరసన చేపట్టాలన్నారు. 26 న బ్లాక్ డే కార్యక్రమంలో రైతులు, కార్మికులు, ప్రజలు పాల్గని మోడీ ప్రభుత్వం రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఇంతియాజ్ పిలుపునిచ్చారు. |

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి