నియోజకవర్గంలో బీపీ నాయక్ విస్తృత పర్యటన
జనవిజయం, 18 సెప్టెంబర్(ఖమ్మం): ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్, వైరా అసెంబ్లీ బిజెపి నేత బీపీ నాయక్ కుటుంబ సమేతంగా యర్రవరం ప్రసిద్ధ దేవాలయం స్వయంయుక్త శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వైరా రూరల్ పాలడుగు గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం వైరా రూరల్, ఏన్కూర్ మండలాల్లో పార్టీ శ్రేణులతో కలిసి తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన భూక్యా పుల్లారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోసూరి గోపాలకృష్ణ, నల్లబోతుల రమేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొవ్వూరు నాగేశ్వరరావు, జిల్లా యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దుద్దుకూరి కార్తీక్, బిజెపి నాయకులు ఏపూరి శ్రీనివాస్, గుత్తా నాగేంద్రబాబు, వీసం వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, బాలకృష్ణ, గుగులోత్ శశికిరణ్, రాందాస్, బొల్లి వెంకటేశ్వర్లు, కృష్ణ, రెంటపల్లి నారాయణ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.