జనవిజయంఎన్నికలుబిజెపికి నేతలు కావాలి !

బిజెపికి నేతలు కావాలి !

భయ తెలుగు రాష్ట్రాల్లో బిజెపిది స్వయం ప్రకాశం లేని పార్టీగా ప్రజలు గుర్తించారు. ఆ పార్టీకి నాయకులు పెద్దగా లేరు. ఉన్నా వారు ప్రకాశవంతంగా ఉన్న వారు కాదు. వారి వెలుగుజాడలు ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడా ప్రసరించడం లేదు. అలాగే నరేంద్రమోడీ, అమిత్ షాల ప్రభావం కూడా ఇక్కడ పడడం లేదు. అంతెందుకు? మొన్నటి బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీని మూడు చెరువుల నీళ్లు తాగించి, ఆమె పార్టీకి చెందిన అనేకులను తమ పార్టీలో చేర్చుకుని, కరోనాతో ప్రజలు చచ్చిపోతున్నా లెక్క చేయకుండా, ఎండలను సైతం ఖాతరు చేయకుండా ఎన్నికలు పెట్టించి, కాలికి బలపం కట్టుకుని ప్రచారంలోకి దిగినా మోడీ-షా ద్వయాన్ని బెంగాల్ ప్రజలు నమ్మలేదు. అధికారానికి దగ్గరగా రానీయలేదు. లోకల్ అంటూ సాగిన మమతా బెనర్జీనే అక్కున చేర్చుకున్నారు. అంటే ప్రజలకు కావాల్సింది నినాదాలు, పథకాలు, మనుషులు కాదని నిరూపించారు. పనిచేసేవారు కావాలి. ప్రజల కోసం తపన పడేవారు కావాలి. ఆదానీ, అంబానీలను మోసేవారు కాదని గట్టిగా హెచ్చరించారు.

దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. బిజెపి నేతలకు కూడా ఇది తెలుసు. అందుకే ఇతర పార్టీల్లో ఉన్న నాయకులను పేరున్న వారిని, సినిమా వారిని లాక్కుని పార్టీ ఇమేజ్ పెంచుకోవాలని, తద్వారా తమ బలాన్ని చాటుకోవాలని చూస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి సీన్ లేదని మొన్నటి ఉప ఎన్నికల్లో ప్రజలు తేల్చేసారు. తిరుపతి ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా రాకుండా చేశారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఆనవాళ్లు లేకుండా చేశారు. తెలంగాణలో సాగర్ ఉప ఎన్నికతో పాటు, మున్సిపల్ ఎన్నికల్లోనూ కర్రుకాల్చి వాత పెట్టారు. దుబ్బాకలో మాత్రం వ్యక్తిగతంగా రఘునందన్ రావు సొంత ఇమేజ్ కలసి రావడం వల్ల గెలవగలిగారు. ఇదంతా ఎందుకు చర్చించాలంటే… బిజెపి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఉన్న ఉద్యోగాలు పోయాయి. కరోనా విరుచుకు పడుతున్నా ప్రాణాలు కాపాడే ప్రయత్నాలు జరగడం లేదు. వ్యాక్సినేషన్లో విఫలమయ్యారు. ధరలు స్వారీ చేస్తున్నా చప్పుడు లేదు. ఉపాధి లేకపోయినా పట్టించుకోవడం లేదు.

బిజెపి రాయికన్నా కాంగ్రెస్ రాయి బెటరన్న స్థాయికి మోడీ ద్వయం పాలనను తీసుకుని వచ్చారు. అందుకే బిజెపి పట్ల ఉన్న ఇమేజ్ పోవడంతో మునుగు తొలగింది. అందుకే అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీల్లో ఉన్న నాయకులను చేర్చుకుని పార్టీ ఇమేజ్ పెంచుకోవాల్సిన దుస్థితికి బిజెపి చేరింది. ఇప్పుడు ఎపిలో అంలాంటి అవకాశం లేదు. తెలంగాణలో ఇటీవల ఉద్వాసనకు గురయిన ఈటల రాజేందర్ కోసం తహతహలాడుతోంది. వారికి ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటివారు అనేకులు కావాలి. ఇప్పుడున్న వారితో ప్రజలను నమ్మించడం సాధ్యం కాదు కనుక వారంతా కావాలని, పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారు.అందుకే మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. నిన్నమొన్నటి వరకు ఆయన కొత్త పార్టీ పెడుతున్నారని, దానికి జెండా, ఏజెండా కూడా ఖరారయ్యాయని సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. ఆయన బీజేపీలో చేరుతున్నారని, సోమ, మంగళవారాల్లో జరిగిన పరిణామాలు అందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఈటల రాజేందర్ మాజీ ఎంపీ వివేక్ ఫాంహౌ లో కిషన్ రెడ్డితో కలిసి మాట్లాడారని చెబుతున్నారు. కిషన్‌రెడ్డిని కలిశారో లేదో గానీ ఈ ఇద్దరు మాత్రం భేటీ అయ్యారని ఇరు వర్గాల నేతలు ధ్రువీకరిస్తున్నారు.

ఈటల కొత్త పార్టీ పెట్ట బోతున్నారని వినృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈటల రాజేందర్ తన బర్తరఫ్ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాటు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, బీజేపీ బీనీ నెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్‌లను కలిసి మాట్లాడారు. బీజేపీలో ప్రస్తుతం వారంతా గుర్తింపు పొందిన నేతలుగా ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు బీజేపీ నేతలందరూ ఈటల ఆ పార్టీలో చేరడానికి సానుకూలంగానే స్పందించారని చెబుతున్నారు. అంటే కొత్తవారిని చేర్చుకుంటే తప్ప బిజెపి నావ ముందుకు కదలదని అర్థం అవుతోంది. ఇప్పటికే రామలుమ్మ, డికె అరుణ, స్వామి గౌడ్ లాంటి వారు చేరినా పెద్దగా లాభించలేదు. అందుకే ఇప్పుడు ఈటెల కోసం తలుపులు తెరిచారు.

ఈటల వైపు నుంచి ఈ బేటీ విషయంలో ఎలాంటి సమాచారం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఈటల తనతో ఫోన్ లో మాట్లాడారని చెప్పడం వాళ్ల భేటీని ధ్రువీకరిస్తున్నదని భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ వ్యవహారానికి తెరపడే అవకాశమున్నది. ఆయన బీజేపీలో చేరరని, కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లోని అనంతృప్తి వాదులను, కాంగ్రెస్ నాయకులను, చీనీ, బహుజన వర్గాలను, తెలంగాణవాదులను ఒక వేదిక పైకి తెచ్చి టీఆర్ఎస్ పై పోటీకి దిగుతారనే అభిప్రాయాన్ని పలువురు వక్తం చేస్తున్నారు. ఈటల రాజేందర్ పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తర్వాత ఒకటి కేసులు నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఆ పార్టీలో చేరే అమాశం లేకపోలేదనే ప్రచారం జరుగుతున్నది. ఈటల బీజేపీ వ్యవహారం హుజూరాబాద్ నియోజకవర్గం, కరీంనగర్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. ఈటల ఈ విషయంలో స్పష్టత ఇస్తేగానీ ఆయన బీజేపీలో చేరుతారా, కొత్త పార్టీ పెడతారన్నది తేలదని భావిస్తున్నారు. మరోవైపు గులాబీ గూటిలో పొనగని నాయకులు ఒక్కొక్కరుగా బీజేపీ ముఖ్య నేతలతో రహస్యంగా సమావేశమవుతున్నట్లు సమాచారం. మరోవైపు, టీఆర్ఎస్లో అనంతృప్తిగా ఉన్న నేతలను తమ వైపునకు తిప్పునేందుకు కమలనాథులు సైతం పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఈటల రాజేందరను లాగడానికి యత్నాలు మొదలయ్యాయి. ఇలా అధికార టీఆర్ఎన్ ను నైతికంగా దెబ్బ తీసి పార్టీని బలోపేతం చేసుకునే ఎత్తుగడలో బిజెపి ఉంది. అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి