ఖమ్మం,మార్చి31(జనవిజయం)
జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాయ భవన సముదాయ సమావేశ మందిరంలో అధికారులతో భూసేకరణ, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నేషనల్ హైవే ల విస్తరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఖమ్మం – దేవరాంపల్లి గ్రీన్ ఫీల్డ్ సెక్షన్ క్రింద జిల్లాలో 89.174 కి.మీ. పొడవు నకుగాను 1356.2025 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇట్టి ప్రాజెక్టును 3 ప్యాకేజీలుగా విభజించడం జరిగిందని, భూసేకరణ పూర్తి చేసి, భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించామన్నారు. కోదాడ-ఖమ్మం నాలుగు వరసల 22.35 కి.మీ. పొడవు గల రహదారి కొరకు భూసేకరణ పూర్తి చేయగా పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. నాగపూర్-అమరావతి (ఖమ్మం-వరంగల్ సెక్షన్) ప్రాజెక్ట్ కొరకు జెఎంఎస్ సర్వే ప్రక్రియ పురోగతిలో ఉందని ఆయన తెలిపారు. కొండపల్లి – కాజీపేట 3వ రైల్వే లైన్ విద్యుత్ సౌకర్యంతో నిర్మాణానికి గాను భూ సేకరణకు చర్యలు ఆవార్డులు పాస్ చేయడం జరిగిందని చెల్లింపులు త్వరితగతిన పూర్తి చేయాలని నేషనల్ హైవే పి.డికి సూచించారు. సింగరేణి కాలరీస్ కంపెనీకి సంబంధించి జేవీఆర్ ఓసి ప్రాజెక్ట్-IIకు గాను భూసేకరణకు అవార్డు పాస్ చేసి, భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు జరిగిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్త, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఇర్రిగేషన్ సిఇ శంకర్ నాయక్, రైల్వే అధికారులు, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, నేషనల్ హైవే పిడి దుర్గాప్రసాద్, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, ల్యాండ్ ఎక్విజేషన్ డి.టి రంజిత్‌కుమార్, సింగరేణి జిఎం, ఇర్రిగేషన్ శాఖ అధికారులు, తహశీల్దార్లు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.