జనవిజయంతెలంగాణభూసేకరణ గెజిట్ దొడ్డిదారి ప్రక్రియ - నున్నా నాగేశ్వరరావు

భూసేకరణ గెజిట్ దొడ్డిదారి ప్రక్రియ – నున్నా నాగేశ్వరరావు

  • కరోనా పరిస్థితుల్లో భూసేకరణకు గెజిట్ విడుదల సరైంది కాదు
  • జూన్ 3న అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరపండి
  • సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపు

ఖమ్మం, జూన్ 1(జనవిజయం): దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తూ, అనేక మంది పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల ప్రాణాలు తీస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ హైవేల కోసం భూసేకరణ చేయుటకు గెజిట్ విడుదల చేయడం సరైన పద్ధతి కాదని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ రోజు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన మండల కార్యదర్శుల ఆన్ లైన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, కోవిడ్ నేపథ్యంలో జిల్లాలో లాక్ డౌన్ అమలు జరుగుతున్న ఈ సందర్భంలో రైతుల వద్ద భూమి గుంజుకునే చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఒడిగట్టిందని వారు అన్నారు. మే 26వ తేదీన జిల్లా మీదుగా వెళుతున్న వరంగల్ టు ఖమ్మం, ఖమ్మం టు విజయవాడ నేషనల్ హైవేలకు గెజిట్ విడుదల చేసిందన్నారు. జిల్లాలో లాక్ డౌన్ వల్ల రైతులు అభ్యంతరాలు పెట్టుకునే వీలు లేదని వారు గుర్తు చేశారు. కావున అభ్యంతరాలకు తేదీని పొడిగించాలని వారు డిమాండ్ చేశారు.

ఇది ముమ్మాటికి దొడ్డిదారి ప్రక్రియనే అని వారు విమర్శించారు. జిల్లాలోని ఖమ్మం రూరల్, రఘునాధపాలెం, చింతకాని, బోనకల్, వైరా, కొణిజర్ల మండలాల్లో భూములు కోల్పోతున్న రైతులు ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. గత సంవత్సరం అనేకసార్లు పోరాటం చేయడం ద్వారా సంవత్సర కాలంగా సర్వే చేయలేకపోయారని, దానితో గెజిట్ రద్దు అయిందని వారు అన్నారు. మరల గెజిట్ ఇవ్వడం సరైంది కాదన్నారు. తక్షణం భూ సేకరణ గెజిట్ ను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కరోనాతో ప్రజలందరూ అల్లాడి పోతున్నారని, వారిని కాపాడాల్సిన బాధ్యత పాలకులకు ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యాక్సిన్ కొనుగోలు చేసి ఉచితంగా ప్రజలందరికి ఇవ్వాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా వైద్యం అందించాలని, జిల్లాలో అన్ని ప్రభుత్వ హాస్పటల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసి, అదనపు సిబ్బందిని కూడా నియమించాలన్నారు. జిల్లాలో తాత్కాలికంగా కరోనా హాస్పిటల్ ఏర్పాటు చేసి, కరనా టెస్ట్ సంఖ్యను పెంచాలని, హాస్పిటల్స్ కు వచ్చే కరోనా పేషెంట్లకు సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధానంగా పైన తెలిపిన సమస్యలతో పాటు స్థానికంగా ఇతర సమస్యలను కూడా జూన్ 3న జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రస్తావించాలన్నారు. పార్టీ శ్రేణులంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి