జనవిజయంఆరోగ్యంమూలిగే నక్క విూద తాటిపండులా బ్లాక్ ఫంగస్!

మూలిగే నక్క విూద తాటిపండులా బ్లాక్ ఫంగస్!

(స్పెషల్ డెస్క్, జనవిజయం)

  • ఆరోగ్యరంగం అప్రమత్తం కావాలి
  • పాలకులు తక్షణమే అప్రమత్తం కావాలి
  • మధుమేహ వ్యాధిగ్రస్థులలో పెరుగుతున్న ఆందోళన
  • ఆందోళన లేదంటూనే జాగ్రత్త పడాలంటున్న వైద్యనిపుణులు
  • ప్రజలకు జాగ్రత్తలు జారీ చేయాల్సిన సమయమిది

మూలిగే నక్క విూద తాటిపండు పడ్డట్లుగా ఉంది ఇప్పుడు ప్రజల పరిస్థితి. దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌తో వేలాది మంది మృత్యువాత పడుతున్న వేళ బ్లాక్‌ ఫంగస్‌ విరుచుకుపడుతోంది. అక్కడక్కడా కొన్నిచోట్ల కనిపించిన ఈ వ్యాధి లక్షణాలు ఇప్పుడు మెల్లగా చాపకింద నీరులా దేశం మొత్తానికి వ్యాప్తి చెందుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు సన్నద్దమై శారీరకంగా, మాసినంగా పోరాడుతున్న వేళ బ్లాంక్‌ ఫంగస్‌ గండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ ఈ వ్యాధి వ్యాప్తి చెందడం, అదికూడా కరోనా నుంచి కొలుకుంటున్న వారికి చుట్టుకోవడం మరింత ఆందోళన కలిగించే విషయం.

ఒక వ్యాధిని అదుపు చేసేందుకు, ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న వేళ సరికొత్త వ్యాధి తరుముకుని రావడం మన వైద్య రంగానికి సవాల్‌గా భావించాలి. కరోనా సమయంలో అనుసరించిన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకుండా ఇప్పుడు పాలకులు దీనిపైనా ప్రత్యేక శ్రద పెట్టాల్సి ఉంది. ఇది మహమ్మారిలా విరుచుకు పడకముందే ప్రజలకు అవసరమైన హెచ్చరికలు చేయాలి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదు అవుతున్నాయి. తొలుత తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామా బాద్‌ జిల్లాల్లో దీనిని గుర్తించారు. ఇప్పుడు ఎపిలోని కర్నూులు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ దీని ఆనవాళ్లు బయటపడ్డాయి. ఓ వైపు కరోనాతో చచ్చిపోతుంటే ..కరోనా వచ్చిపోయిన వారివిూద దీనిప్రభావం చూపుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో పలువురు బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి బారిన పడుతున్నారనేది వాస్తవం. ఓ వైపు కరోనా వైరస్‌ తో ప్రజలు అల్లాడుతుంటే..మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ కలవరపెడుతోంది. ఈ ఫంగస్‌ తో పలువురు మృతి చెందుతున్నారని వార్తలు వెలువడుతుండడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది.

ప్రధానంగా మధుమేహ వ్యాధిగ్రస్థులు ఆందోళన చెందుతున్నారు. మధుమేహం నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడుతున్న వారిలో తీవ్ర భయం రేకేత్తుతోంది. అయితే.. షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకుంటే బ్లాక్‌ ఫంగస్‌ గురించి భయపడాల్సిన అవసరమే లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. శ్వాస సరిగా ఆడక పోవడం, ముక్కు పుటలాలు పూర్తిగా మూసుకుని పోయినట్టుగా మారడం, చీమిడిలో నల్లని చారు అంటే బ్లాక్‌ స్పాట్స్‌ గానీ పడుతుంటే బ్లాక్‌ఫంగస్‌ అని నిర్దారించవచ్చు. తలనొప్పి, జ్వరం, కండ్ల మంటలు లక్షణాలు కూడా ఉంటాయి. ప్రాథమిక దశలోనే గుర్తించి శస్త్రచికిత్స చేయడం ద్వారా దీనిని నియంత్రించ వచ్చని వైద్యులు చెపుతున్నారు. ఆదిలోనే గుర్తిస్తే ముందుగా ఎండోస్కోపీ ద్వారా ముక్కులో నుంచి బ్లాక్‌ఫంగస్‌ను పూర్తిగా తొలగించే అవకాశం ఉంటుంది. తర్వాత దాదాపు వారంపాటు రోజూ డ్రెస్సింగ్‌ చేసుకుంటూ.. యాంటీ ఫంగస్‌ చికిత్సను కొనసాగిస్తే కండ్లు, మెదడుకు ఫంగస్‌ చేరకుండా నిలువరించవచ్చంటున్నారు.

షుగర్‌ ను కంట్రోల్‌ ఉంచుకోవాలంటే..ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుందని, పలు ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జొన్న, కొర్రలు, రాగులు, అండుకొర్రలతో చేసిన ఆహారం, బీరకాయ, సోరకాయ, గోరు చిక్కుడు, చిక్కుడు కాయల్లో పీచు ఎక్కువగా ఉంటుందని, వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల.షుగర్స్‌ లెవల్స్‌ పెరగవని అంటున్నారు. అలాగే.. పైనాపిల్‌ నిమ్మ, జామపండ్లు తీసుకోవాంటున్నారు. వీటిల్లో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. బియ్యంతో చేసిన ఇడ్లీలు, దోశలు, అన్నం, పఫ్‌లు, బంగాళ దుంప వంటి వాటికి దూరంగా ఉండాలి. కరోనా సోకిన తర్వాత స్టెరాయిడ్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో షుగర్‌ ఎక్కవవుతుందని, మందులతో నియంత్రణలోకి రాదని వైద్యులు వెల్లడిస్తున్నారు. షుగర్‌ నియంత్రణలోకి వచ్చేవరకూ ఇన్సులిన్‌ వాడుకోవచ్చని, నియంత్రణలోకి వచ్చాక ఇన్సులిన్‌ ఆపేసి తిరిగి మందులు వాడొచ్చని స్పష్టం చేస్తున్నారు.

బ్లాక్‌ ఫంగస్‌ అంటే మ్యూకరోమైకోసిస్‌ అనే రైజోఫస్‌ జాతికి చెందినది. ఇది మనుషులకు హాని చేసే శిలీంధ్రం. ఇది చెత్తచెదారం, కూరగాయలు, పండ్లు, చెక్క, పేడ లాంటి ప్రదేశాలో ఉంటుంది. మనం గాలి పీల్చినపుడు ముక్కులోని సైనసు అనే గాలిబుడగలోకి చేరి అక్కడ పెరుగు తుంది. కళ్ళకు, మెదడుకు వ్యాపిస్తే చాలా ప్రమాదం. ఆరోగ్య వంతులైన మనుషుల ముక్కులలో కూడా ఉంటుంది. హాని చేయదు. కాని ఇమ్యూనిటీ తగ్గితే దాడి చేస్తుంది. ఇది ఇంతకు మునుపు కిడ్నీ మార్పిడి వారికి, కాన్సరు వారికి, హెచ్‌ఐవి ఎయిడ్స్‌ వారికి, ఇమ్యునోసప్రెషన్‌ మందులు వాడేవారికి వచ్చేది. డయాబెటిస్‌ వారికి అరుదుగా వస్తుంది. కోవిడ్‌లో సైటోకైన్‌ స్టార్మ్‌తో కేసులు చేరినపుడు అది మన ఇమ్యూనిటీ ఓవర్‌ రియాక్షన్‌ వల్ల వస్తుంది. దానిని తగ్గించడానికి స్టెరాయిడ్స్‌ అధిక మోతాదులో ఇస్తారు. ఇదే సమయంలో షుగర్‌ లెవల్స్ డయాబెటిక్‌లో పెరగతాయి. అప్పుడు మన కణజాలంలో ఈ ఫంగస్‌ పెరుగుతుంది.

షుగర్‌ కంట్రోలులో ఉంటే ఏమి కాదు. చాలామందికి 12-15 రోజులలో కరోనా రికవరీ తరువాత వస్తోంది. ముక్కు దిబ్బడ, ముక్కు చుట్టు బ్లాక్‌ పాచు, రక్తం కారడం, కళ్ళువాపు, నొప్పి, కనుబొమ్మ వాలిపోవడం, చూపు మందగించడం. వ్యాధి సోకితే ఆఖరుకు కన్ను తీసివేయవలసి రావచ్చు. మెదడుకు పాకవచ్చు. దీనికి ఆంటిఫంగల్‌ మందు నరానికి ఆంఫోటెరిసిన్‌ 3500 అయ్యే సూదులు రోజు ఒకటి 6-8 వారాలు వాడాలి. ఫెస్‌ అనే పద్దతి ద్వారా ఎండోస్కోపి ఉపయోగించి ఫంగస్‌ను ముక్కు లోంచి తీసేస్తారు. ఇది పెద్ద సమస్య కాకపోయినా ఇలా కేసులు చాలా చోట్ల బయటపడడం సమస్యాత్మకం అవుతోంది. షుగర్‌ లేని వారికొస్తే ముక్కులో బిటాడిన్‌ స్వాబ్‌తో రెండుపూటలా శుభ్రపరచుకోవాలి. మొత్తానికి బ్లాక్‌ ఫంగస్‌కు భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే కరోనాతో ఒళ్లు,ఇల్లు గుల్ల చేసుకున్న వారికి ఈ వ్యాధి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. దీనిపై తక్షణ చర్యకు ఆరోగ్యరంగం నడుం బిగించాలి. అప్పుడే ప్రజలు నిశ్చింతంగా ఉండగలరు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి