ప్రజలు భయాందోళనలకు గురికావొద్దు
- అప్రమత్తంగా ఉండండి
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
భద్రాచలం, జూలై 20, (జనవిజయం):
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గురువారం భద్రాచలం లో పర్యటించి గోదావరి వరద పరిస్థితి పై అధికారులతో సమీక్షించారు. పెరుగుతున్న గోదావరి వరదల వల్ల ప్రజలు భయాందోళలు చెందవద్దని కోరారు. అప్రమత్తం గా ఉండాలని సూచించారు. అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. వరదలు పెరిగే ప్రమాదం ఉన్నందున ముంపు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించి, పునరావస కేంద్రాలకు తరలించాలని రేగా కోరారు. అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని అన్నారు.
ముంపు ప్రాంత ప్రజలను తరలించే సమయంలో అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పారు. కాలువలు, చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్ లు వద్ద తగు రక్షణ చర్య తీసుకోవాలని కోరారు. రెవిన్యూ, పంచాయతీ, ఇరిగేషన్, విద్యుత్, పోలీస్ శాఖ, ఆరోగ్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్న మాల, ఏ.ఎస్.పి పంకజ్ సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.