జనవిజయంఅధ్యయనంభయంతో బలి అవుతున్నవారే ఎక్కువ

భయంతో బలి అవుతున్నవారే ఎక్కువ

  • మానసిక దౌర్బల్యంతోనే కరోనా తీవ్రత
  • పరిశోధనలలో తేలుతున్న సత్యం
  • లాక్ డౌన్లు, క్వారంటైన్లు భయాన్ని పెంచేలా ఉండకూడదు
  • ప్రజలకు ధైర్యాన్ని పెంచే బోధకులు అవసం

న్యూఢిల్లీ,జూన్ 14(జనవిజయం): కరోనా వ్యాధితో మరణించే కన్నా చాలామందిలో మానసికంగా వైకల్యం బాగా దెబ్బతీస్తోందని నిపుణులు చెబుతున్నారు. మానసికంగా ధృడంగా ఉంటూ.. బలవర్ధక ఆహారం తీసుకునే వారికి పెద్దగా ప్రమాదం ఉండదంటున్నారు. ఇటీవలి కేసులను పరిశీలిస్తే అనేకమంది భయంతో చనిపోయారని తెలుస్తోంది. మానసిక దౌర్బల్యం ఉన్నవారిలో వైరన్ భయం మరింతగా పనిచేస్తోంది. ఇది వారిని మృత్యువుకు చేరువచేస్తోందని పరిశోధనలలో వెల్లడైందని లాన్సెట్ వైద్య జర్నల్ గతంలోనే తెలిపింది. ప్రజల మానసిక శక్తినిబట్టి ఏడు నుంచి పాతిక సంవత్సరాల వరకూ ప్రాణకాలం హరించుకుని పోతుంది. లేదా వారికి ఇతరత్రా వ్యాధులు ఎక్కువగా సంక్రమించేలా రోగనిరోధక శక్తి తగ్గుతుందని వెల్లడైంది. అన్నింటిని తేలిగ్గా తీసుకునే వారితో పోలిస్తే మానసిక అశక్తత ఉన్నవారిలో ఈ అవలక్షణం ఎక్కువగా కన్పిస్తుందని తేల్చారు.

కోవిడ్ 19 మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా మనిషి మానసిక ఆరోగ్య పరిస్థితిపై పలురకాలుగా ప్రభావం పడుతుంది. ఎప్పటికప్పుడు మనిషిని ఈ వైరన్ ఏమి చేయదనే ధైర్యాన్ని కల్పించాల్సి ఉంటుందని నిపుణులు సూచించారు. ప్రత్యేకించి ఈ దిశలో వారికి నిపుణులైన మానసికవేత్తలు, వైద్యుల నుంచి సరైన బోధనలు ఇప్పించాల్సి ఉంటుంది. అయితే వైరన్ చికిత్సపై ఎక్కువగా దృష్టి సారించే ప్రభుత్వాలు ఇప్పుడు వైరస్ వల్ల ఏదో జరుగుతుందనే ఆందోళనకు గురవుతున్న జనం స్థితి గురించి ఆలోచించే పరిస్థితిలో లేవని కూడా తేల్చారు. క్వారంటైన్లు, లాక్ డౌన్ల ను వైరన్ నియంత్రణలకు ఉద్దేశించారు. అయితే ఈ దశలు నిజానికి ఇతరత్రా భయాందోళనలకు దారితీసే అంశాలుగా మారాయని వెల్లడయింది. కరోనాకు ముందు మనుష్యులలో ఉన్న మానసిక రుగ్మతలను, ప్రస్తుత వైరన్ తీవ్రస్థాయి దశల్లో ఉన్నప్పటి స్థితితో పోల్చిచూశారు.

ఈ దశలో కొందరిలో అత్యధిక స్థాయిలో రుగ్మతలు పెరిగినట్లు గుర్తించారు. పరిశోధకులు ఆన్ లైన్ ద్వారా వివిధ వర్గాలు, వయోతారతమ్యాలు ఉన్న ప్రజల స్థితిగతుల ను తెలుసుకుని, ప్రస్తుత వైరన్ మిగిల్చిన ఆందోళనలతో వారిలో తలెత్తిన స్పందనలను ఆకళింపు చేసుకుని నిర్దిష్టమైన రీతిలో తమ నివేదిక వెలువరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఇప్పుడు వైరన్ గురించి జరిగే ప్రచారం తేలిగ్గా అందరిని ప్రభావితం చేస్తోంది. అయితే మానసిక బలహీనత తో ఉండేవారిలో ఇది ఎక్కువగా ప్రతికూలతకు దారితీస్తోందని తేల్చారు. అందుకే అత్యంత తీవ్రస్థాయి ప్రచార సాధనాలతో వైరన్ పట్ల అవగావహన కల్పిస్తూనే మానసిక చైతన్యానికి ఎక్కువగా పాటుపడాల్సి ఉందని అధ్యయనంలో సూచించారు. మానసికగా, శారీరకంగా బలంగా ఉండేలా చూసుకోవాలి. కరోనా రావడంతో కలిగే దుష్ఫలితాలు లేవు. అయితే మానసికంగా కృంగిపోతే చేసేదేమీ లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి