Thursday, October 5, 2023
Homeవార్తలుప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రజల ప్రాణాలు పోయాయి - మల్లు భట్టి విక్రమార్క

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రజల ప్రాణాలు పోయాయి – మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఆగష్టు 3 (జనవిజయం) : రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తాయని తెలిసినప్పటికి అధికార యంత్రాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున ప్రాణ, పంట, ఆస్తి నష్టం జరిగింది. 60 మంది చనిపోవడం గతంలో ఎప్పడు చూడలేదు. ప్రజల ధన మన ప్రాణాలు కాపాడాల్సినంత యంత్రాంగం ఉన్నప్పటికీ ప్రభుత్వ అశ్రద్ధ, మానవ తప్పిదాల వల్ల పెద్ద నష్టం జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు.

భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ దిగువన :

69 చెరువుల తెగిపోయి వాగులు పొంగడంతో మొరంచపల్లి ఊరు మునిగింది. చెరువుల మెయింటెన్స్ ను ప్రభుత్వం పట్టించుకోకుండా చేసిన నిర్లక్ష్య ఫలితమే చెరువులు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులకు మెయింటెన్స్ ను ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మెయింటెన్స్ కి నిధులు విడుదల చేయకపోవడం వల్ల మొరంచపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి, పంట, పాడి నష్టం జరిగింది.

సాంకేతికపరమైన ఆలోచనలతో కాకుండా రాజకీయపరమైన అవసరాల కోసం చెక్ డ్యాంల నిర్మాణం చేశారు. రిటైనింగ్ వాల్స్ కట్టకపోవడం వల్ల భూమి కోత జరిగి కిన్నెరసాని నదిపై నాగారం బ్రిడ్జి వద్ద 2 సంవత్సరాల క్రితం కట్టిన చెక్ డ్యాం కొట్టుకుపోయింది. రాష్ట్రంలో ఆనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం చెక్ డ్యాంల నిర్మాణం చేశారు తప్పా శాస్ర్తీయంగా నిర్మాణం జరుగకపోవడమే కొట్టుకుపోయి వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యింది.

సాంకేతికంగా అధ్యయనం చేయకుండా, శాస్త్రీయంగా ఇంజనీరింగ్ డిజైన్ చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ఆలోచనలతో కాళేశ్వరంపై చెక్ డ్యాముల మాదిరిగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులను నిర్మాణం చేయడం వల్ల బ్యాక్ వాటర్ తో మంథని, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల్లో లక్షల ఎకరాల పంట నీట మునిగింది. రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను గాలికి వదిలేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం.

రూ. 750 కోట్లతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి దానికి అనుగుణంగా సీతమ్మ సాగర్ ప్రాజెక్టును అడ్డగోలుగా కట్టడం వల్ల బ్యాక్ వాటర్ తో అనేక పరిసర ప్రాంతాల్లోని ఆనేక గిరిజనగూడెలు నీట మునిగాయి. పశువులు కొట్టుకుపోయి, ప్రజలు గల్లంతయ్యారు. ప్రజలు నివసించే ఊర్లలో పడవలు వేసుకొని తిరగాల్సిన దుస్థితిని సీఎం కేసీఆర్ తీసుకొచ్చిండు. ఇందుకు నీట మునిగిన సున్నం బట్టి గ్రామం సాక్ష్యం.

కాంగ్రెస్ శాసనసభ్యులు సీతక్క, పొదేం వీరయ్య, శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు గారలు గోదావరి వరదతో తమ నియోజకవర్గాల్లో ముప్పు పొంచి ఉందని వెంటనే రెస్క్యూ టీంలను పంపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా పెడచెవిన పెట్టిన కేసీఆర్ బిఆర్ఎస్ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక విమానాలను పొరుగు రాష్ట్రాలకు పంపించి అక్కడి నాయకులను ప్రగతి భవన్ కు పిలిపించుకొని గులాబీ కండులు కప్పారు. కానీ తెలంగాణ ప్రజలు అల్లాడిపోతుంటే మాత్రం పట్టించుకోకుండా పరిపాలన మొత్తం కేసీఆర్ గాలికి వదిలేశారు.

అధికార యంత్రాంగాన్ని బిఆర్ఎస్ పార్టీ అవసరాల కోసం వాడటం వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితిలో యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. భద్రాచలం ముంపునకు గురికాకుండ ఉండటానికి కరకట్టల నిర్మాణం, కాలనీల నిర్మాణానికి రూ. 1000 కోట్లు ఇస్తామని గత సంవత్సరం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ వరదలు వచ్చి ముంపుకు గురైన పైసా ఇవ్వలేదు.
.
2016 సంవత్సరంలో భద్రాచలం కు వెళ్లిన కేసీఆర్ రూ. 100 కోట్లు ఇస్తామన్నారు. గత సంవత్సరం వెయ్యి కోట్లు ఇస్తానని ఇవ్వలేదు. ప్రజలను మోసం చేయడం సీఎం కేసీఆర్ కు అలవాటయింది. బ్రమలు కల్పించి మోసం చేయడం కెసిఆర్ కు అలవాటైన విద్య. ప్రజల్ని కాదు భద్రాచలం రాముని సైతం మోసం చేయడం కెసిఆర్ కు అలవోకగా మారింది. ప్రజలను, దేవుడిని మోసం చేసిన సీఎం కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని భద్రాచలం రాముడికి మొక్కి వచ్చాను
.
అనాలోచితంగా ఆశాశ్రీయంగా సీతారామ ప్రాజెక్టు కట్టి గిరిజనుల ముంపునకు కారణమైన సీఎం కేసీఆర్. లక్షల రూపాయలతో నిర్మించే ఇండ్లను సైతం ఇంజనీరింగ్ ప్లానింగ్ తో కట్టుకుంటాం. వేల కోట్లతో నిర్మించే ప్రాజెక్టులకు ఇంజనీరింగ్ డిజైన్ అవసరం లేదని కేసీఆర్ డిజైన్ చేయడం ఏంటి?

వరదల భీభత్సంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే స్పందించాలి. సమీక్షాలు జరిపి తగిన నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపోయిన బాధితులను ఆదుకోవాలి. మే నెలలో ఫ్లడ్స్ పై సమీక్షలు జరిపేవాళ్లు. వరద విపత్తులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సమయాత్తం చేసేవారు. ఈ ఏడాది ఎందుకు సమీక్షలు చేయలేదు. పట్టించుకోలేదు. అందుకే ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన అధికారులను వరద ముంపు ప్రాంతాలకు పంపించి పంట ఇండ్లు ఆస్తి ప్రాణ నష్టం అంచనా వేయించి వెంటనే పరిహారం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకోవాలి

రాష్ట్రంలో జరిగిన వరద బీభత్సం పై రాష్ట్ర గవర్నర్ ను కలిసి కాంగ్రెస్ పార్టీగా వినతిపత్రం ఇవ్వనున్నాము. వరద బీభత్సం పై రాష్ట్ర గవర్నర్ గారు ఇప్పటికే రివ్యూ చేసి ఉండాల్సి ఉండే. కానీ చేయలేదు. ఇప్పటికైనా సమీక్ష చేసి తగిన నివారణ చర్యలు తీసుకునే విధంగా అధికారులను ఆదేశించాలి.

వరద బీభత్సం వల్ల జరిగిన నష్టం తెచ్చి ఇవ్వలేము. ప్రాణాలు కోల్పోయిన వారిని తీసుకురాలేము. ప్రజలు ఆత్మస్థైర్యంతో నిబ్బరంగా ఉండి ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలి. వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. వరద బాధితులకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. సామాజిక బాధ్యతగా గుర్తించి కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలి.న సమిష్టిగా వరద బాధితులకు ధైర్యం ఇచ్చి అండగా నిలబడదాం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments