భారత్ బచావో భద్రాచలం డివిజన్ సదస్సు జయప్రదం చేయండి!
జనవిజయం , 8 జులై(భద్రాచలం):జూలై 9 న భద్రాచలం లోని గిరిజన అభ్యుదయ భవన్ లో జరిగే భారత్ బచావో భద్రాచలం డివిజన్ సదస్సు ను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘ భాద్యులు చల్లగుండ్ల నాగేశ్వరరావు పూనెం వీరభద్రం రామాచారి కోరారు. శనివారం గిరిజన అభ్యుదయ భవన్లో జరిగిన ముఖ్యుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ప్రజల సమస్యలన్నింటినీ పక్కన పడేసి ,మతోన్మాదాన్ని పెంచి పోషిస్తు కలిసి మెలిసి జీవిస్తున్న హిందువులు,ముస్లింలు,క్రిస్టియన్లు తదితర ప్రజల మధ్య విద్వేశాలను సృష్టిస్తూ మన భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ దేశంలో ప్రజలను అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంచిన మనువాదాన్ని రాజ్యాంగంగా తేవాలని శర వేగంగా కుట్రలతో ప్రణాళికలు రచిస్తున్నారని దీనిని భారత పౌరులు తిప్పి కొట్టాలని అన్నారు.
దేశభక్తి కలిగిన పౌరులుగా మన ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని తెలిపారు. పార్టీలు ప్రజా సంఘాలు ప్రజాస్వామిక వాదులు అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలతో సంబంధం లేని ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సదస్సులో డాక్టర్ గోపీనాథ్ ,భారత్ బచావో జాతీయ వైస్ చైర్మన్. గాదె ఇన్నయ్య , భారత్ బచావో జాతీయ కౌన్సిల్ సభ్యులు మల్లెల రామనాథం, భారత్ బచావో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు. తదితరులు పాల్గొంటారు.