Tuesday, October 3, 2023
Homeవార్తలుబిఆర్ఎస్ - భారత “రైతు” సమితి 

బిఆర్ఎస్ – భారత “రైతు” సమితి 

  • రైతులను రాజు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే
  • రైతులకు లక్ష రుణమాఫీ
  • రైతు బాంధవుడు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కారేపల్లి, ఆగస్టు3(జనవిజయం): సింగరేణి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు సీఎం కేసీఆర్  చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచుకుంటూ, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 మేనిఫెస్టోలో ప్రకటించిన లక్ష రూపాయల రైతు రుణమాఫీ ని బుధవారం ప్రకటించడంతో, వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్  ఆదేశాల మేరకు గురువారం కారేపల్లి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నందు మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్  ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచుకుంటూ, బాణసంచా కాల్చి సింగరేణి మండల రైతులు, నాయకులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా నాయకులు, రైతులు మాట్లాడుతూ బిఆర్ఎస్ అంటే భారత “రైతు” సమితి అని మరోసారి రుజువైంది. జై కిసాన్ అనేది మాకు కేవలం ఓ నినాదం కాదు. మా ప్రభుత్వ విధానం అని మరోసారి తేలిపోయింది. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా బీజేపీ సర్కారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్ సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనం.  రైతు సంక్షేమంలో తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం, రైతుకు రక్షణ కవచంగా అమలుచేసిన ప్రతి పథకం వ్యవసాయ రంగ చరిత్రపై చెరగని సంతకం, దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం కానీ. ఒక్క తెలంగాణలోనే వ్యవసాయం అంటే సంతోషం యావత్ తెలంగాణ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న నినాదమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు ముత్యాల సత్యనారాయణ, మండల రైతుబంధు కన్వీనర్ ఈశాల నాగేశ్వరరావు, సర్పంచ్ బాణోత్ కుమార్, కురసం సత్యనారాయణ, బాణోత్ మారు సకృ, సొసైటీ డైరెక్టర్ లు మర్సకట్ల రోశయ్య, డేగల ఉపేందర్, కో ఆప్షన్ ఎండి హనీఫ్, మండల మహిళ అధ్యక్షరాలు బాణోత్ పద్మావతి, మండల ఉపాధ్యక్షరాలు పప్పుల నిర్మల, నాయకులు బత్తుల శ్రీనివాస్, అడపా పుల్లారావు, సుడిగాలి బిక్షమయ్యా, మండల సోషల్ మీడియా కన్వీనర్ భూక్య రాంకిషోర్ నాయక్, బీసీ సెల్ అధ్యక్షుడు పిల్లి వెంకటేశ్వర్లు, యూత్ మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘు, షేక్ శంషుద్దీన్, మండల యువజన నాయకులు బాణోత్ కోటి, గుగులోత్ హారు, ఉపసర్పంచ్ లు మణికొండ నాగేశ్వరరావు, భూక్య చాందిని, షాదిఖాన చైర్మన్ షేక్ షఫీ, నాయకులు నాగండ్ల సీతయ్య, షేక్ సంసుద్దీన్, తొగరు రమేష్, బాణోత్ వీరన్న(చక్రం), చెవుల చందు, కల్తీ అరుణ్ కుమార్, మౌలాలి, బన్సీలాల్, తొగరు శ్రీను, అదేర్ల రామారావు, సయ్యద్ అజ్మద్, తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments